కొత్త కోర్టుల ఏర్పాటుతో సత్వర న్యాయసేవలు

కొత్త కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు.

Published : 26 Mar 2023 03:23 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కొత్త కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో శనివారం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ... తెలుగులో మాట్లాడలేకపోతున్నానని, కానీ అర్థం చేసుకుంటానన్నారు. బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా అవకాశం వచ్చిందని, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనకు మంచి న్యాయమూర్తుల బృందం ఉందని, టీం వర్క్‌తో ముందుకు వెళుతున్నామన్నారు. న్యాయాన్ని రక్షించడంలో న్యాయవాదుల పాత్ర ముఖ్యమైందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి, జస్టిస్‌ జి.అనుపమ చక్రవర్తి, జస్టిస్‌ ఎ.సంతోష్‌రెడ్డి, జస్టిస్‌ పుల్ల కార్తీక్‌, జిల్లా జడ్జి నీలిమ, కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, ఎస్పీ భాస్కర్‌, మెట్‌పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని