మూసీ జలాశయం నుంచి నీటి విడుదల

నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్‌ పూర్తిగా నిండడంతో సోమవారం అధికారులు డ్యామ్‌ మూడో నంబరు క్రస్ట్‌గేట్‌ ఎత్తి నీటిని దిగువకు  విడుదల చేశారు.

Published : 06 Jun 2023 03:33 IST

కేతేపల్లి, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్‌ పూర్తిగా నిండడంతో సోమవారం అధికారులు డ్యామ్‌ మూడో నంబరు క్రస్ట్‌గేట్‌ ఎత్తి నీటిని దిగువకు  విడుదల చేశారు. మండు వేసవిలో పూర్తిస్థాయిలో జలాశయం నిండడం రెండున్నర దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా సోమవారం 644.60 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతుండడంతో అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి సూచనల మేరకు ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్‌ డ్యామ్‌ మూడో నెంబరు క్రస్ట్‌గేట్‌ను అరడుగు మేర లేపి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి జలాశయంలో 4.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 300 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా దిగువ మూసీలోకి అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల రైతులు, మత్స్యకారులు, అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదలశాఖ ఈఈ డి.భద్రు సూచించారు. సూర్యాపేట, పెన్‌పహాడ్‌, కేతేపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో రైతులు తమ పశువులను వదిలిపెట్టొద్దని, మూసీ వాగు వెంట మోటార్లను భద్రపరుచుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని