మే 24న టీఎస్‌ పాలిసెట్‌

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘పాలిసెట్‌-2024’ని మే 24వ తేదీన నిర్వహించనున్నారు. గతంలో మే 17న పరీక్ష ఉండగా దాన్ని తాజాగా మార్చారు.

Published : 23 Apr 2024 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘పాలిసెట్‌-2024’ని మే 24వ తేదీన నిర్వహించనున్నారు. గతంలో మే 17న పరీక్ష ఉండగా దాన్ని తాజాగా మార్చారు. ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ఈ నెల 22 వరకు ఉండగా దానిని 28వ తేదీకి పొడిగించారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి సూచించింది. వచ్చే నెల 24న పరీక్షలు నిర్వహించి, పది రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు