టీఎస్‌ఈఏపీసెట్‌కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు

తెలంగాణలోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్‌ఈఏపీసెట్‌-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

Published : 08 May 2024 03:58 IST

తొలిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానం అమలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్‌ఈఏపీసెట్‌-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు వ్యవసాయ, ఫార్మసీ (ఏపీ) విభాగంలో ఉదయం 9 గంటలకు నుంచి 12 వరకు జరిగిన మొదటి సెషన్‌ పరీక్షకు 90.41 శాతం మంది, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన రెండో సెషన్‌ పరీక్షకు 91.24 శాతం మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి వెల్లడించారు. మొదటి సెషన్‌లో 33,500 మందికి గాను 30,288, రెండో సెషన్‌లో 33,505 మందికి గాను 30,571 మంది హాజరయ్యారు. ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 301 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల్లో తొలిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానం అమలు చేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ నరసింహారెడ్డి, సెట్‌ కన్వీనర్‌ బీడీ కుమార్‌ తదితరులు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. .7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా, 9 నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ విభాగాల కోసం ప్రవేశపరీక్షలు జరగనున్నాయి.

టీఎస్‌ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువు పెంపు

రాష్ట్రంలోని విద్యాకళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘టీఎస్‌ఎడ్‌సెట్‌-2024’కి ఆలస్యరుసుం లేకుండా దరఖాస్తు గడువును ఈ నెల పదో తేదీ వరకు పొడిగించిన  ట్లు సెట్‌ కన్వీనర్‌ తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆలస్యరుసుం రూ.250తో ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు