భయపడతాం కానీ.. మాట్లాడాలి!

నాకు ఆందోళన సమస్యలున్నాయి. తీవ్ర ఒత్తిడికి గురవుతుంటా. ఒక్కోసారి తీవ్ర భావోద్వేగాలకీ, ప్రతి చిన్నదానికీ అసహనానికి లోనవుతా. అది చూసి అందరూ ‘ఊరికే విసుక్కుంటుంది, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది’ అనేస్తుంటారు.

Updated : 09 Jan 2023 09:39 IST

- శ్రుతి హాసన్‌, నటి

నాకు ఆందోళన సమస్యలున్నాయి. తీవ్ర ఒత్తిడికి గురవుతుంటా. ఒక్కోసారి తీవ్ర భావోద్వేగాలకీ, ప్రతి చిన్నదానికీ అసహనానికి లోనవుతా. అది చూసి అందరూ ‘ఊరికే విసుక్కుంటుంది, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది’ అనేస్తుంటారు. కానీ నా పరిస్థితే వేరక్కడ. మొదట్లో చెప్పలేక.. భయపడి ఊరుకునేదాన్ని. తర్వాత ఎంతో మంది మానసిక ఆరోగ్యంపై మాట్లాడటం మొదలుపెట్టారు. నేను నా సమస్యను ఎందుకు చెప్పకూడదనిపించింది. ఇప్పుడు ‘పిరియడ్‌’లో ఉన్నా చెబుతా. ఆ రోజు ఏ డ్యాన్సో, ఫైటో ఉంటుంది. నాకేమో అసౌకర్యం, నొప్పి లాంటివి ఉన్నాయనుకోండి.. సరిగా చేయలేను. కానీ నా పరిస్థితి ఎదుటి వాళ్లకి తెలియదు కదా! ‘ఏంటి ఇలా చేస్తోంది’ అనుకుంటారు. కాబట్టి.. ‘నేను పిరియడ్‌లో ఉన్నా. విపరీతమైన నొప్పి ఉన్నా పని చేస్తున్నా.. ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకోండ’ని చెబుతుంటా. అప్పుడు చూసే కోణం మారుతుంది. మానసిక ఆరోగ్యానికి చికిత్సలు తీసుకున్నా. సంగీతం కూడా నాకు ఆందోళనను తగ్గించే మార్గమే. ఇప్పటికీ అనుకున్నది అనుకున్నట్లుగా అవ్వకపోయినా.. షూటింగ్‌లో, ఇంట్లో ఏవైనా సరిగా లేకపోయినా ఒత్తిడి అనిపిస్తుంటుంది. పరిస్థితి తీవ్రమవుతోంది అనిపిస్తే వెంటనే థెరపీ కోసం వెళతా. అయితే దాయాలని అనుకోను. దాచినప్పుడే మరింత ఒత్తిడి. ఏమనుకుంటారో అని భయపడతాం కానీ.. ఓసారి మాట్లాడి చూడండి. సమస్య పరిష్కారమవుతుందో లేదో తర్వాతి సంగతి! మనసులోని అదనపు భారం తగ్గుతుంది. పరిష్కరించుకునే మార్గమూ దొరుకుతుంది. కాబట్టి.. సమస్య ఏదైనా చెప్పండి.. దాని గురించి మాట్లాడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్