లిల్లీ.. నైనా.. లోపెజ్.. అలా లక్షల్లో సంపాదించేస్తున్నారు!

టెక్నాలజీలో వచ్చే కొత్త కొత్త మార్పులు ప్రజల జీవితాన్ని ఎంతో మార్చేస్తున్నాయి. మొన్నటివరకు మనుషులు ఇచ్చే సందేశాలతో గ్యాడ్జెట్లు పనిచేసేవి. కానీ, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ స్వరూపమే మారిపోయింది.

Updated : 04 Apr 2024 21:03 IST

టెక్నాలజీలో వచ్చే కొత్త కొత్త మార్పులు ప్రజల జీవితాన్ని ఎంతో మార్చేస్తున్నాయి. మొన్నటివరకు మనుషులు ఇచ్చే సందేశాలతో గ్యాడ్జెట్లు పనిచేసేవి. కానీ, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ స్వరూపమే మారిపోయింది. మానవ ప్రమేయం లేకుండానే సొంత మేధస్సుతో గ్యాడ్జెట్లు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా క్రియేటర్లు ఆన్‌లైన్‌లో వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లను రూపొందిస్తున్నారు. వీటిలో మహిళల పాత్రలే అధికం. భౌతిక రూపం లేని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆన్‌లైన్‌లో విపరీతంగా సంపాదించడం గమనార్హం. డిజిటల్‌ ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ లిల్లీ రెయిన్ కూడా ఇదే కోవకు చెందుతుంది. లిల్లీ నెలకు దాదాపు 17 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఈ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

‘రియల్‌’ అనిపించేలా...!

సాధారణంగా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ప్రతిభను రంగరించి వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. దీనికి సమయంతో పాటు డబ్బు కూడా అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత చేసినా అందులో విజయవంతమయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. కానీ, వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలాంటి రిస్క్ లేకుండానే పేరు సంపాదిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘లిల్లీ రెయిన్‌’ డిజిటల్ ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోంది. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టుగా ఫొటోలు, వీడియోలు రూపొందించి, వాటిని ఎప్పటికప్పుడు ‘ఫ్యాన్‌వ్యూ’ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది.

సాధారణంగా ట్రావెల్‌ ఇన్ఫ్లుయెన్సర్లు సుదీర్ఘ ప్రయాణాలు, సాహసాలు చేస్తుంటారు. లిల్లీ ఇవేవీ లేకుండానే కృత్రిమే మేధ సాంకేతికతతో అభిమానులను ఆకట్టుకునే వీడియోలు చేస్తోంది. అది కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఫొటోలు పోస్ట్‌ చేస్తుంటుంది. వాటిని చూసిన ఎవరికైనా వర్చువల్‌ ఫొటోల్లా అనిపించవు. అందుకే ఆమెకు అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇలా లిల్లీ నెలకు 20 వేల డాలర్లు సంపాదిస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 17 లక్షల రూపాయలన్నమాట!

‘బార్బీ’లా.. గర్ల్ ఫ్రెండ్‌లా..!

కేవలం లిల్లీనే కాకుండా మరికొంతమంది వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఇదే స్థాయిలో సంపాదిస్తున్నారట. ఈ క్రమంలో అచ్చం బార్బీ బొమ్మలా ఉండే ‘బార్బీ’ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఏకంగా 35 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇక Foxy AI సంస్థ రూపొందించిన ‘లెక్సీ లవ్‌’ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌ సింగిల్‌గా ఉండే వారికి ‘పర్‌ఫెక్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌’లా యాక్ట్‌ చేస్తుందట. అలా లెక్సీ నెలకు దాదాపు 35 లక్షలు సంపాదిస్తుందట. అలాగే వర్చువల్‌ ఫిట్‌నెస్‌ మోడల్.. అయితనా లోపెజ్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు.

మన దేశంలో కూడా బ్యూటీ, ఫిట్‌నెస్‌, ఫ్యాషన్‌ వంటి అంశాలపై వీడియోలు చేస్తూ నైనా అవతార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోంది. నైనాకు ఇన్‌స్టాలో రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇలా కృత్రిమ మేధ సాంకేతికతతో మనిషి కాని మని‘షి’ చేత క్రియేటర్లు లక్షల్లో ఆర్జిస్తున్నారు. మరి.. మీరూ AI లో నిపుణులైతే ఇలాంటి సరికొత్త అవతార్ లను సృష్టించేస్తారా?!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్