ఎయిర్ ప్యూరిఫయర్‌కు బదులు ఇవి!
ప్రస్తుత రోజుల్లో పీల్చే గాలిలో కూడా నాణ్యత కరువవుతోంది. దీంతో గాలిని శుభ్రం చేయడానికి కొంతమంది ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ప్రస్తుత రోజుల్లో పీల్చే గాలిలో కూడా నాణ్యత కరువవుతోంది. దీంతో గాలిని శుభ్రం చేయడానికి కొంతమంది ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వేలకు వేలు డబ్బులు పోసి దాన్ని కొనే అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఇంట్లోని గాలిని శుద్ధి చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి...
ఈ రెండూ ఉంటే చాలు!
తాజా వేపాకులు, అరటీస్పూన్ పసుపు.. ఈ రెండింటినీ ఒక బౌల్లో తీసుకొని అందులో నిండా నీళ్లు పోసి ఓసారి కలుపుకోవాలి. ఈ బౌల్‌ని గదిలో ఓ మూలన లేదా టేబుల్‌పై ఉంచితే ఆ గదిలోని గాలి ఇట్టే శుభ్రపడుతుంది. అంతేకాదు.. ఈ మిశ్రమంతో చేతుల్ని కూడా శానిటైజ్ చేసుకోవచ్చు.
దేంతో.. ఏం ఉపయోగం?
⚛ వేపాకుల్ని సహజసిద్ధమైన ఎయిర్ ఫిల్టర్స్గా పిలుస్తారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్.. వంటి ఎన్నో గుణాలు ఈ ఆకుల్లో ఉన్నాయి. వీటి ఉపరితలం గాలిలోని కార్బన్ డయాక్సైడ్తో పాటు ఇతర కాలుష్య కారకాలను, దుమ్ము-ధూళిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. తద్వారా గాలి శుభ్రపడుతుంది.
⚛ ఇక పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయి.
ఇవి కూడా!
⚛ గదిలోని గాలి పరిశుభ్రంగా ఉండాలంటే సరైన వెంటిలేషన్ ఉండడం తప్పనిసరి. లేదంటే ఆ గదిలోని తేమ అక్కడి గాలిని కలుషితం చేస్తుంది.
⚛ ఇక కిచెన్‌లో వెలువడే ఘాటైన వాసనల్ని బయటికి పంపించేయడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని అమర్చుకోవాలి. ఇది ఇంట్లోని కలుషితమైన గాలిని కూడా బయటికి పంపించడంలో సహకరిస్తుంది.
⚛ చాలామంది ఇంట్లో సువాసన కోసం సెంటెడ్ క్యాండిల్స్‌ని వినియోగిస్తుంటారు. అయితే వీటిలోని రసాయనాల వల్ల గాలి మరింత కలుషితమవుతుంది. అందుకే వీటికి బదులుగా బీస్‌వ్యాక్స్ క్యాండిల్స్‌ని ఉపయోగించడం ఉత్తమం. ఇవి నెమ్మదిగా కరగడంతో పాటు వీటి నుంచి ఎలాంటి పొగ వెలువడదు. అలాగే ఇంట్లోని గాలిని శుద్ధి చేయడానికీ ఇవి చక్కగా ఉపయోగపడతాయి.
⚛ సాల్ట్ ల్యాంప్స్ కూడా సహజసిద్ధమైన ఎయిర్ ప్యూరిఫయర్స్‌గా ఉపయోగపడతాయి. ఇవి ఇంట్లోని గాలిలో ఉండే విషపదార్థాలను ఆకర్షించి.. గాలిని శుద్ధి చేస్తాయి.
⚛ వెదురు కర్రలను మండించగా తయారైన బొగ్గుని కూడా న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫయర్‌గా పిలుస్తారు. ఇది ఎలాంటి వాసనను వెదజల్లదు.. సరికదా గాలిలోని విషపదార్థాలను, కాలుష్య కారకాలను, బ్యాక్టీరియా, వైరస్‌లను ఆకర్షించే గుణం దీనికి చాలా ఎక్కువ.
⚛ ఇక ఇంట్లోని గాలిని శుద్ధి చేసుకోవడానికి ఇండోర్ ప్లాంట్స్ కూడా చక్కగా దోహదం చేస్తాయి. ముఖ్యంగా కలబంద, తులసి, బోస్టన్ ఫెర్న్, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, రబ్బర్ మొక్కలు, పీస్ లిల్లీ, చామంతి.. వంటి మొక్కల కుండీలను ఆయా గదుల్లో అమర్చడం వల్ల అక్కడి గాలి శుద్ధవుతుంది.
⚛ గాలిలోని వివిధ సూక్ష్మక్రిములను పారదోలే శక్తి అత్యవసర నూనెలకు ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందుకే రోజ్మేరీ, టీట్రీ, నిమ్మ, లవంగం, గ్రేప్ ఫ్రూట్.. వంటి అత్యవసర నూనెల్లో ఏదో ఒకదాన్ని కొన్ని కాటన్ బాల్స్‌పై వేసి.. ఇంటి గదుల్లో అక్కడక్కడా అమర్చుకోవడం వల్ల అక్కడి గాలి శుభ్రపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- నా ఉత్తరాలు చూసి.. కన్నీళ్లతో హత్తుకున్నారు.. తీరు మార్చుకున్నారు!
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- ఏడిపిస్తోంటే... ప్రేమంటున్నారు!
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!