చర్మాన్ని మెరిపించే క్యారట్!

క్యారట్.. ఆరోగ్యానికే కాదు.. సౌందర్య సంరక్షణలోనూ ఎంతగానో ఉపకరిస్తుంది. వీటితో వార్ధక్యాన్ని నివారించే, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే రకరకాల ఫేస్‌ప్యాక్స్, మాస్క్స్ కూడా చేసుకోవచ్చు.

Published : 16 Feb 2024 13:00 IST

క్యారట్.. ఆరోగ్యానికే కాదు.. సౌందర్య సంరక్షణలోనూ ఎంతగానో ఉపకరిస్తుంది. వీటితో వార్ధక్యాన్ని నివారించే, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే రకరకాల ఫేస్‌ప్యాక్స్, మాస్క్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని మంచి సుగుణాలు క్యారట్ సొంతం కాబట్టే చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. పైగా ఇంట్లో సులభంగా లభించేదే కాబట్టి అందుబాటు బడ్జెట్‌లోనే కాంతులీనే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

మేకప్‌కి ముందు!

మనం వేసుకునే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉండాలంటే చర్మంలో తేమశాతం బాగుండాలి. అందుకే మేకప్ వేసుకోవడానికి ముందు అరటేబుల్ స్పూన్ క్యారట్ జ్యూస్‌కి, అరటేబుల్ స్పూన్ కమలారసం జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మేకప్ వేసుకుంటే ఆ ప్రభావం ఎక్కువసేపు కనిపిస్తుంది.

పిగ్మెంటేషన్ సమస్యకూ..

మీరు పిగ్మెంటేషన్ సమస్యతో సతమతమవుతున్నారా? అయితే ఈ ప్యాక్ ప్రయత్నించి చూడండి..

కావాల్సినవి:

క్యారట్‌ జ్యూస్- 2 టేబుల్‌స్పూన్స్

ఓట్స్ పౌడర్- 1 టేబుల్‌స్పూన్

పసుపు- తగినంత

చక్కెర- 1 టేబుల్‌స్పూన్

తయారీ:

ముందుగా క్యారట్‌ని తరిగి గ్రైండ్ చేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్‌కి ఓట్స్ పౌడర్‌ని జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మెత్తని పేస్ట్‌లా అయ్యాక దానికి కాస్త పసుపు, పంచదార జత చేయండి. బాగా మిక్స్ చేశాక ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు మేని ఛాయని మెరుగుపరిస్తే, క్యారట్ జ్యూస్ చర్మం కాంతులీనడానికి సహాయపడుతుంది. పంచదార, ఓట్స్ పౌడర్ స్క్రబ్‌లా పనిచేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్