పిల్లలకో బుజ్జి టాయిలెట్‌ సీట్‌!

చిన్నారులకు పాటీ ట్రైనింగ్‌ ఇవ్వడమంటే అమ్మలకు సవాలే! ఎందుకంటే చాలామంది పిల్లలు మూత్ర విసర్జన/మల విసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. బాత్‌రూమ్‌లో ఉన్న టాయిలెట్‌ కమోడ్‌ను చూసి భయపడుతుంటారు.

Published : 12 Feb 2024 12:44 IST

చిన్నారులకు పాటీ ట్రైనింగ్‌ ఇవ్వడమంటే అమ్మలకు సవాలే! ఎందుకంటే చాలామంది పిల్లలు మూత్ర విసర్జన/మల విసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. బాత్‌రూమ్‌లో ఉన్న టాయిలెట్‌ కమోడ్‌ను చూసి భయపడుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే పసి వయసు నుంచే వారికి పాటీ ట్రైనింగ్‌ ఇవ్వడం ముఖ్యం. అయితే బాత్‌రూమ్‌లో ఉన్న పెద్ద కమోడ్‌పై వారు కూర్చోలేరు. కాబట్టి వాళ్ల సౌకర్యార్థం చిన్న పరిమాణంలో ఉన్న టాయిలెట్‌ సీట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని డిజైన్లలో దొరుకుతున్నాయి.

బాతు బొమ్మ ఆకృతిలో ఉన్నవి, హెలికాఫ్టర్‌ తరహాలో డిజైన్‌ చేసినవి, స్కూటర్‌లా తయారుచేసినవి, కప్ప ఆకృతిని పోలి ఉన్నవి, విభిన్న బొమ్మల రూపంలో రూపొందించినవి, ఫోల్డబుల్‌ తరహాలో తయారుచేసినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్లలోనే ఇవి లభిస్తున్నాయి. అయితే వీటిని పిల్లల సీట్‌కి అనుగుణంగా డిజైన్‌ చేశారు. అలాగే వాళ్లు పడిపోకుండా ఉండేందుకు ఇరువైపులా హ్యాండిల్స్‌ కూడా అమర్చారు. ఇక మరికొన్ని టాయిలెట్‌ సీట్స్‌కి మెత్తగా ఉండేందుకు కుషన్లను కూడా ఏర్పాటుచేశారు. ఏడాది దాటిన చిన్నారులకు వీటిని ఎక్కడంటే అక్కడ అమర్చుకొని టాయిలెట్‌ శిక్షణ ఇవ్వచ్చు. ఇక వారి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సీట్స్‌ని కమోడ్‌పై అమర్చి చిన్నారులు బాత్‌రూమ్‌లో మూత్ర విసర్జన/మల విసర్జన చేసేలా ప్రోత్సహించచ్చు. ఇక వీటిని శుభ్రం చేసుకోవడం సులభం! అలాగే ఫోల్డబుల్‌ తరహా టాయిలెట్‌ సీట్స్‌ అయితే ప్రయాణాల్లో కూడా మన వెంటే తీసుకెళ్లచ్చు. ఇలా బోలెడన్ని ఉపయోగాలు, ఫీచర్లు ఉన్న బేబీ టాయిలెట్‌/పాటీ సీట్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్