మచ్చలు.. ముడతలు.. పోగొట్టే బాదం!

మహిళల ముఖ సౌందర్యాన్ని తగ్గించే సమస్యల్లో ముడతలు, పిగ్మెంటేషన్ ప్రధానమైనవి. ముడతలతో వయసు పైబడిన వారిలా కనిపిస్తే... పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద విహీనంగా మారుతుంది....

Published : 21 May 2024 12:57 IST

మహిళల ముఖ సౌందర్యాన్ని తగ్గించే సమస్యల్లో ముడతలు, పిగ్మెంటేషన్ ప్రధానమైనవి. ముడతలతో వయసు పైబడిన వారిలా కనిపిస్తే... పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద విహీనంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాదం పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చని చెబుతున్నారు నిపుణులు.

చర్మ సమస్యలకు చెక్!
క్యాలరీలు తక్కువగా ఉండే బాదం పప్పును చాలామంది బరువు తగ్గించుకోవడానికి స్నాక్స్‌గా వినియోగిస్తారు. ఇందులోని విటమిన్‌-ఇతో పాటు మోనో అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వుల కారణంగా వీటిని నిత్యం తీసుకునే మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని అధ్యయనాల్లో తేలింది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న బాదం పప్పుతో మహిళల్లో ముఖం పైన ముడతలు, పిగ్మెంటేషన్ మచ్చలు కూడా మాయమవుతాయని చెబుతున్నారు నిపుణులు.

అదే కారణం!
‘బాదంలో విటమిన్-ఇ, అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మెనోపాజ్ దశలో మహిళల ముఖం పైన ఏర్పడే ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను తగ్గించేస్తాయి’ అంటున్నారు చర్మసౌందర్య నిపుణులు.

అందుకే ఇవి డైట్‌లో ఉండాల్సిందే!
‘ప్రతిరోజూ బాదం పప్పులు తినడం వల్ల మహిళల ముఖంపై ముడతలు తగ్గడమే కాకుండా చర్మపు రంగులో కూడా మార్పులొస్తాయి. బాదం పప్పుల్లో విటమిన్‌-ఇ అధికంగా ఉంటుంది. వీటితో పాటు అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. మహిళలు తమ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఈ పోషకాలు ఎంతగానో సహకరిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మహిళలు, ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు తమ రోజువారీ డైట్‌లో బాదం పప్పులను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం’ అని వారు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్