Eye Exercise: ఆట లాంటి వ్యాయామం

పంచేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో దేనికదే ముఖ్యమైనా కళ్లు మరీ అవసరం. పిల్లలకు చదువు భారంతో పాటు మొబైల్‌ చూడటం ఎక్కువై బాగా అలసిపోతున్నాయి. నరాలు ఒత్తిడికి గురవుతాయి. చిన్న తరగతుల్లోనే చూపు తగ్గుతోంది. స్క్రీన్‌ ఎక్కువ చూడటం వల్ల విశ్రాంతి లేకపోవడం వల్ల కళ్లకు మరింత అలసట.

Published : 06 May 2023 00:16 IST

పంచేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో దేనికదే ముఖ్యమైనా కళ్లు మరీ అవసరం. పిల్లలకు చదువు భారంతో పాటు మొబైల్‌ చూడటం ఎక్కువై బాగా అలసిపోతున్నాయి. నరాలు ఒత్తిడికి గురవుతాయి. చిన్న తరగతుల్లోనే చూపు తగ్గుతోంది. స్క్రీన్‌ ఎక్కువ చూడటం వల్ల విశ్రాంతి లేకపోవడం వల్ల కళ్లకు మరింత అలసట. నిద్రలేమితోనూ బాధ పడుతున్నారు. కళ్లు చూడటానికే కాదు, మన మనసులో ఏముందో ఎదుటివాళ్లకి చూపుతాయి. మన ఇష్టం, అయిష్టం, కోరిక, నిర్వేదం, దిగులు, ఉత్సాహం లాంటి భావాలన్నీ కళ్లలో ప్రతిఫలిస్తాయి. ఇంత ముఖ్యమైన వాటి గురించి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పిల్లలు పట్టించుకోరు. అందుకని వాళ్లతో ఆటలా అనిపించే వ్యాయామం చేయిద్దాం.

ఇలా చేయాలి.. మీ చిన్నారిని సదుపాయంగా ఉండే ఆసనంలో నడుం వంచకుండా నిటారుగా కూర్చోమని కళ్లతో అక్షరాలను రాయమనాలి. చేత్తో కదా రాస్తాం అంటారా? ఇక్కడ కను గుడ్డుతో రాయాలి. శరీరంలో ఇతర భాగాలేవీ కదలకుండా కేవలం కంటితో ఎ, బి, సి, డి.. అంటూ జెడ్‌ వరకూ అక్షరాలను రాయమనాలి. ముఖం అటూ ఇటూ కదిలించకూడదు. కేవలం కళ్లతోనే రాయాలి. ఇందులో కష్టమేమీ లేదు, చాలా తేలికే. పైగా సరదాగానూ ఉంటుంది. అక్షరాలు కాదంటే 1 నుంచి 20 వరకూ అంకెలు రాయమనొచ్చు. మనసులో అనుకుంటూ కళ్లతో రాయమంటే ఇష్టంగా రాస్తారు. ఇలా రోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు చేయించాలి. ఈ కంటి వ్యాయామం చేసిన తర్వాత కాస్త సేదతీరాలి. మళ్లీ తిన్నగా కూర్చుని ఎదురుగా ఒక కేంద్ర బిందువులా పెట్టుకుని దానివైపే తిన్నగా చూడాలి. లేదంటే ఎదుట బొమ్మ, వస్తువు, క్యాండిల్‌ ఏదైనా అమర్చి, రెప్ప వేయకుండా దానివైపే తదేకంగా చూడాలి. నయనాల వెంట నీళ్లు కారేదాకా అలాగే చూసి, అప్పుడు కళ్లు మూసుకోవాలి. కొద్దిసేపు అలా కూర్చుని రెండు చేతులను రుద్ది (రబ్‌ చేసి) రెప్పల మీద పెట్టి తీసి మెల్లగా కళ్లు తెరవాలి.

ప్రయోజనాలు... ఇది అద్భుతమైన వ్యాయామం. ముఖ్యంగా గాడ్జెట్స్‌ ఎక్కువగా వాడే వాళ్లకి చాలా మంచిది. దీని వల్ల కళ్లకు అలసట తగ్గి సేదతీరుతాయి. కళ్ల చుట్టూ కండరాలు బలోపేతమవుతాయి. కంటి నరాలు ఉత్తేజితమౌతాయి. రక్త సరఫరా సవ్యంగా ఉంటుంది. ఆక్సిజన్‌ అందుతుంది. కళ్లు తేటగా ఉంటాయి. ఎర్రబడటం, దురద, మంట, కళ్లలోంచి నీళ్లు కారడం, బ్లర్‌ అవ్వడం లాంటి కంటి సమస్యలు తలెత్తవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్