పండగ వేళ..ఖర్చు జాగ్రత్త!

కొత్త ఏడాదిలో పెద్ద పండగ సంక్రాంతి. కాస్త భారీగానే చేసుకుంటాం. దీనికితోడు ఎటుచూసినా ఆఫర్ల వెల్లువలు. మరి వేడుక మోజులోపడి.. బడ్జెట్‌ దాటి పోవడం లేదు కదా!

Published : 10 Jan 2023 00:06 IST

కొత్త ఏడాదిలో పెద్ద పండగ సంక్రాంతి. కాస్త భారీగానే చేసుకుంటాం. దీనికితోడు ఎటుచూసినా ఆఫర్ల వెల్లువలు. మరి వేడుక మోజులోపడి.. బడ్జెట్‌ దాటి పోవడం లేదు కదా!

ముందుగానే.. నెలవారీ బడ్జెట్‌ ఎలాగూ వేస్తాం. పండగంటే దానిలో మార్పులు వచ్చేస్తాయి. దుస్తులు, బహుమతులు, అలంకరణ.. వేటికెంత కేటాయించు కుంటున్నారో ముందే నిర్ణయించుకోండి.

చెక్‌ చేసుకోవాలి... మొదట కొన్నవాటికి ఎక్కువ ఖర్చుపెట్టేయడం.. చివరికి నాణ్యత లేనివి తీసుకోవడమో.. డబ్బులు సరిపోక కొనకపోవడమో చాలాసార్లు జరిగేదే! కానీ ఆ లోటు తెలుస్తూనే ఉంటుంది. ఆ పరిస్థితి తలెత్తొద్దంటే ముందే ఇంకా ఏం కొనాలి.. దీనికెంత వరకూ ఖర్చు పెట్టొచ్చు అనేది చెక్‌ చేసుకుంటే సరి! ఇప్పుడసలే ఆన్‌లైన్‌ కాలం.. టక టకా కొట్టేస్తుంటాం. ఈ క్రమంలో అనుకున్న బడ్జెట్‌ దాటేసే ప్రమాదమూ లేకపోలేదు. ప్రతి చెల్లింపునీ నోట్‌ చేసుకుంటే.. సమస్య ఉండదు.

అప్పుకి నో.. ‘ఎప్పుడో కదా పండగ వచ్చేది.. కాస్త ఆడంబరంగా... ఫర్లేదులే!’ చాలామంది ఆలోచించేదే ఇది. ఇంకా పక్కవాళ్లతో పోల్చుకొని ఖర్చూ చేస్తుంటారు. అప్పు తీసుకునేప్పుడు బాగానే ఉంటుంది. కట్టేటప్పుడే భారం. పైగా ఒక్కరోజు ఆనందం కోసం ఆలోచిస్తే కొన్ని నెలలపాటు సర్దుబాటు చేసుకోవాలి. మధ్యలో అదనపు ఖర్చులు వచ్చాయంటే ఆ భారం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ‘అప్పు తీసుకోవద్దు’ నియమాన్ని తప్పక పాటించండి.

పరిశీలించండి.. పెద్ద పండగ కదా! ప్రతి దానిలోనూ డిస్కౌంట్లు. కాస్త ఓపిగ్గా పరిశీలించండి. ఎక్కడ తక్కువకు దొరుకుతుందో రూఢీ చేసుకుంటే డబ్బూ ఆదా. తక్కువకు వస్తున్నాయి కదా అని అనవసరమైనవి కొనొద్దు. ఏమేం కావాలో జాబితా రాసుకొని దానికే పరిమితమవ్వాలి. అప్పుడు వృథాకీ ఆస్కారముండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్