గట్టిగా నమ్మితే చాలు

అమెరికాలో పుట్టిపెరిగినా.. భారతీయత అణువణువూ నిండిన కుటుంబం మాది. ఆడపిల్ల తనకాళ్లపై తాను నిలబడాలని భావించే మా అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచీ నేను స్వతంత్రంగా ఆలోచించేలా ప్రోత్సహించారు. అందుకే స్కూలు వయసునుంచే సామాజిక అంశాలపై పనిచేయడం మొదలుపెట్టగలిగా.

Updated : 07 Feb 2023 15:17 IST

మెరికాలో పుట్టిపెరిగినా.. భారతీయత అణువణువూ నిండిన కుటుంబం మాది. ఆడపిల్ల తనకాళ్లపై తాను నిలబడాలని భావించే మా అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచీ నేను స్వతంత్రంగా ఆలోచించేలా ప్రోత్సహించారు. అందుకే స్కూలు వయసునుంచే సామాజిక అంశాలపై పనిచేయడం మొదలుపెట్టగలిగా. గ్రామీణ జీవితాల్ని గమనించొచ్చని సూక్ష్మరుణ ప్రాజెక్టులతో కలిసి కొన్నాళ్లు పనిచేశా. ఆ సమయంలో రాజస్థాన్‌ రాష్ట్రంలోని విద్యుత్తులేని కొన్ని గ్రామాల్లో నివసించా. అక్కడ కిరోసిన్‌ దీపం అంటుకుని ఓ తల్లీబిడ్డ గాయాల పాలవడం నన్నెంతో కలచివేసింది. మహిళా సాధికారతకు, గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంతైనా అవసరం. అవి కల్పించాలకున్నా. అయితే, మార్పు మనసులో కోరుకుంటే సరిపోదు. వాటి అమలుకి ముందడుగు మనమే వేయాలి. ఇందుకోసం నాలుగేళ్లు వేల గ్రామాలు తిరిగా. స్థానికుల అవసరాలతో డేటాబేస్‌ నిర్వహించి, ఆపై ప్రత్యేకంగా ఉత్పత్తులు తయారు చేయించి తక్కువ ఖరీదుకి రాయితీలతో సరఫరా చేశాం. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక యువతకు శిక్షణ ఇచ్చాం. మహిళల ఆర్థిక సాధికారత కోసం ‘సోలార్‌ సహేలీ’ పేరుతో స్వయం సహాయక బృందాలు’ ఏర్పాటు చేశా. ‘ఆడపిల్లవు నువ్వేం చేస్తావ్‌’ అంటే..., ‘వీళ్లకి ఇదంతా ఫ్యాషన్‌... నాలుగు రోజులు తిరిగి వెళ్లిపోతారు. దీన్ని సంఘసేవగా చెప్పుకుంటారంటూ’ ఎగతాళి చేశారు ఇంకొందరు. ఇప్పుడు వేల గ్రామాలూ, లక్షల మంది జీవితాల్లో మార్పు వచ్చింది. మనల్ని మనం నమ్మి....ఏదైనా చేయాలని గట్టిగా అనుకుంటే చాలు... ఎన్ని కష్టాలొచ్చినా గట్టెక్కేస్తాం.

- అజైతా షా, ఫ్రంటియర్‌ మార్కెట్స్‌ సీఈవో

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్