ఎర్ర కందిపప్పుతో స్క్రబ్బింగ్‌..

విటమిన్లు పుష్కలంగా ఉండే ఎర్ర కందిపప్పు స్క్రబ్బింగ్‌ చర్మానికి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని మురికిని బయటకు పంపడమే కాకుండా మెరిసేలా చేసి, ముడతలు, గీతలు, వృద్ధాప్యచాయలను దూరం చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. 

Published : 29 Jun 2022 00:54 IST

విటమిన్లు పుష్కలంగా ఉండే ఎర్ర కందిపప్పు స్క్రబ్బింగ్‌ చర్మానికి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని మురికిని బయటకు పంపడమే కాకుండా మెరిసేలా చేసి, ముడతలు, గీతలు, వృద్ధాప్యచాయలను దూరం చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. 

మొదట నాలుగు చెంచాల ఎర్ర కందిపప్పును శుభ్రపరిచి ఒక గిన్నెలోకి తీసుకొని మునిగేలా రోజ్‌వాటర్‌ వేసి నాలుగు గంటలు నాననివ్వాలి. తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి నీటిని విడిగా తీసేయాలి. పేస్టులో చెంచా పెరుగు, రెండు చెంచాల బీట్‌రూట్‌ పొడి లేదా కాఫీపొడితోపాటు చెంచా సెనగపిండి వేసి బాగా కలపాలి. ఈ క్రీంతో స్క్రబ్బింగ్‌ చేయడానికి ముందుగా ముఖాన్ని మురికి లేకుండా శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం పచ్చి లేదా కాసిన పాలను రెండు చెంచాలు తీసుకొని అందులో దూది ఉండను ముంచి ముఖాన్ని, మెడను శుభ్రపరచాలి. ఆపై మెత్తని వస్త్రంతో ముఖాన్ని తుడిచి, తయారుచేసుకున్న క్రీంను ముఖానికి, మెడకు అప్లై చేసి మృదువుగా అయిదు నిమిషాలు స్క్రబ్‌ చేయాలి. అయిదు నిమిషాలు ఆరనిచ్చి నీటిలో ముంచిన మెత్తని వస్త్రంతో శుభ్రపరిచి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగితే చాలు. పెరుగులోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మంలోని మృతకణాలను దూరం చేస్తే, సెనగపిండి చర్మంలోని జిడ్డు గుణాన్ని పోగొడుతుంది. మచ్చలు, మొటిమలను దూరం చేసి తాజాదనాన్ని అందిస్తుంది. ఎర్రకందిపప్పు స్క్రబ్బింగ్‌తో ముఖం మెరుపులీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్