కంటికింద వలయాలకు కాఫీ సీరం..

పావుకప్పు కాఫీగింజలకు పావుకప్పు బాదంనూనె, రెండు చెంచాల గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ లేదా ఆలివ్‌ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడి గాజుసీసాలో వేసి మూత పెట్టి, చల్లని ప్రదేశంలో ఉంచాలి. మధ్యలో రెండు మూడు రోజులకొకసారి నూనెలో కాఫీ గింజలు కరిగేలా బాగా షేక్‌ చేస్తుండాలి.

Updated : 18 Oct 2022 05:31 IST

ముఖవర్చస్సును తగ్గించే కంటికింద వలయాలు, వాపు, నలుపుదనం వంటివాటిని వీలైనంత త్వరగా దూరం చేయాలి. లేదంటే ఇవి శాశ్వత మచ్చలుగా మారే ప్రమాదం ఉంది. ఇంట్లోని పదార్థాలతోనే వీటిని మటుమాయం చేయొచ్చు అంటున్నారు నిపుణులు.  

పావుకప్పు కాఫీగింజలకు పావుకప్పు బాదంనూనె, రెండు చెంచాల గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ లేదా ఆలివ్‌ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడి గాజుసీసాలో వేసి మూత పెట్టి, చల్లని ప్రదేశంలో ఉంచాలి. మధ్యలో రెండు మూడు రోజులకొకసారి నూనెలో కాఫీ గింజలు కరిగేలా బాగా షేక్‌ చేస్తుండాలి. రెండు వారాల తర్వాత మెత్తని వస్త్రంతో ఈ నూనెను వేరే పొడిగా ఉండే సీసాలోకి వడకట్టి చల్లని ప్రదేశంలో భద్రపరిస్తే నాలుగైదు వారాలు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ సీరంను రాత్రి నిద్రపోయే ముందు కంటి కింద రాసి, మృదువుగా రుద్ది ఆరనివ్వాలి. కాఫీ గింజల్లో కెఫీన్‌ కంటి కింది వలయాలను, వాపును పోగొట్టడానికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ముఖచర్మంలో పేరుకొనే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, చర్మాన్ని తాజాగా, మచ్చల్లేకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. దీంతో కంటికింద వాపు మాయమవుతుంది. ఈ మిశ్రమంలో కలిపిన బాదంనూనె కంటికింద చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చి నలుపుదనాన్ని దూరం చేస్తుంది. కంటి చుట్టుపక్కల ఏర్పడే సన్నని గీతలను తగ్గించి వృద్ధాప్య ఛాయలనుంచి సంరక్షిస్తుంది.

కాఫీ పొడితో..

రెండు చెంచాల కాఫీపొడికి ఆరు చెంచాల బాదం నూనెతోపాటు రెండు విటమిన్‌ ఈ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పొడి గాజుసీసాలో నింపి చల్లని ప్రదేశంలో ఉంచి రెండు రోజులకొకసారి బాగా కలపాలి. వారం రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి పొడిసీసాలో భద్రపరచాలి. ఈ సీరంను రెండు వారాలు నిల్వ ఉంచుకోవచ్చు. రెండు చుక్కల సీరంను కంటికింద వలయాకారంలో మృదువుగా మర్దనా చేసి ఆరనివ్వాలి. ఇందులోని విటమిన్‌ ఈ కంటికింద చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యఛాయలను త్వరగా రానివ్వదు. కంటి చుట్టూ ఉండే గీతలను మాయం చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్