మేనికి అందం.. మనసుకి ఆనందం!

మెదడుని స్తబ్దుగా మార్చే కాలమిది! దీనికితోడు చర్మం నిర్జీవంగా తయారవుతుంది. పొడిబారి.. దద్దుర్లు, దురద, ఎర్రబడటం వంటివెన్నో! వాటన్నింటికీ బాత్‌ సాల్ట్‌తో చెక్‌ పెట్టేయొచ్చట. 

Published : 24 Nov 2022 00:46 IST

మెదడుని స్తబ్దుగా మార్చే కాలమిది! దీనికితోడు చర్మం నిర్జీవంగా తయారవుతుంది. పొడిబారి.. దద్దుర్లు, దురద, ఎర్రబడటం వంటివెన్నో! వాటన్నింటికీ బాత్‌ సాల్ట్‌తో చెక్‌ పెట్టేయొచ్చట.

* గోరువెచ్చని నీటిలో బాత్‌సాల్ట్‌ రెండు స్పూన్లు కలిపి స్నానం చేయండి. ఇది శరీరానికి డీటాక్సింగ్‌గా పనిచేస్తుందట. చర్మంలో మలినాలు పోయేలా చేయడంతోపాటు శరీరానికి విశ్రాంతి భావననీ అందిస్తాయి.

* చర్మంపై మృతకణాలను తొలగించి, మృదువుగా మారుస్తుంది. ఈ కాలం చర్మం పొడిబారి దురదకు కారణమవుతుంది. అది ఈ స్నానంతో తగ్గుతుంది. ఎగ్జిమా, సొరియాసిస్‌ వంటి లక్షణాలు కనిపిస్తున్నవారికీ  దీంతో ఉపశమనం కలుగుతుందట. శరీరమంతా నొప్పులుగా అనిపిస్తున్నా ఈ స్నానం చేసేయండి. బాత్‌ సాల్ట్‌ వాటితోపాటు తలనొప్పినీ దూరం చేయగలదు.

* అలసట, ఒత్తిడి అనిపించినప్పుడు ఎప్సమ్‌ సాల్ట్‌ను వేడి నీటిలో కలిపి, స్నానం చేసేయండి. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం మెదడు నుంచి సెరటోనిన్‌ విడుదలయ్యేలా ప్రేరేపిస్తుంది. అంత సమయం లేదంటే ఆ నీటిలో పాదాలను 5 నిమిషాలు నానబెట్టినా రిలాక్స్‌ అయిన భావన కలుగుతుంది. ఆందోళన, నిద్రలేమి సమస్యలున్న వారికీ ఇది మంచి చికిత్స.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్