అందాన్ని.. అలవాటు చేసుకోండి!

కొందరు ఎప్పుడూ కెమెరా రెడీగా ఉంటారు. మేమూ బోలెడు క్రీములు రాస్తున్నాం అయినా ఏదో లోటే! వీళ్లకు మాత్రం అంతటి అందం ఎలా సాధ్యం.. అనిపిస్తుంటుంది కదా! ఈ చిన్ని అలవాట్లను చేసుకోండి.. మీరూ ఆ జాబితాలో చేరిపోవచ్చు. చర్మంపైకి చేరిన దుమ్ము కళా విహీనంగా కనిపించేలా చేయడమే కాదు..

Updated : 10 Dec 2022 04:08 IST

కొందరు ఎప్పుడూ కెమెరా రెడీగా ఉంటారు. మేమూ బోలెడు క్రీములు రాస్తున్నాం అయినా ఏదో లోటే! వీళ్లకు మాత్రం అంతటి అందం ఎలా సాధ్యం.. అనిపిస్తుంటుంది కదా! ఈ చిన్ని అలవాట్లను చేసుకోండి.. మీరూ ఆ జాబితాలో చేరిపోవచ్చు.

చర్మంపైకి చేరిన దుమ్ము కళా విహీనంగా కనిపించేలా చేయడమే కాదు.. మొటిమలు, డీహైడ్రేషన్‌, త్వరగా వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలకీ కారణమవుతుంది. అందుకే రోజూ ఉదయం, రాత్రి పడుకోబోయే ముందు తక్కువ గాఢత ఉన్న ఫేస్‌వాష్‌తో ముఖాన్ని తప్పక శుభ్రం చేసుకోవాలి.

కాలమేదైనా సన్‌స్క్రీన్‌ వాడకం తప్పనిసరి. పెద్దగా ఎండలేదు, మంచు పడుతోంది వంటి సాకులొద్దు. ఇంట్లో ఉన్నా రాయాల్సిందే. ఎండలో బయటికి వెళితే మాత్రం ప్రతి రెండు గంటలకూ ఓసారి రాస్తుండాలి. ఎండ నుంచి రక్షణ దొరకడమే కాదు.. వృద్ధాప్యఛాయలు, క్యాన్సర్‌లనూ ఇది దరిచేరనీయదు.

శరీరం ఆరోగ్యంగా ఉంటేనే.. చర్మమూ మెరిసేది! కాబట్టి, పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోండి. విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్‌, న్యూట్రియంట్లు సమపాళ్లలో అందేలా డైట్‌ ప్లాన్‌ చేసుకోండి. జంక్‌ఫుడ్‌, నూనె పదార్థాలు, సోడాలకు దూరంగా ఉండండి. శరీరానికి తగిన నీరు అందకపోతే చర్మంలో స్థితిస్థాపకత తగ్గుతుంది. అది తేమ కోల్పోకూడదంటే తగినంత నీటిని అందించాలి. రోజులో కనీసం 7 గ్లాసుల నీటిని తప్పని సరి చేసుకోండి.

మారుతున్న జీవనశైలిలో నిద్ర తగ్గుతోంది. రాత్రుళ్లు ఆలస్యంగా పడుకోవడం.. ఉదయాన్నే పననో, ఉద్యోగమనో పరుగులు తీయడం. ఫలితమే నిర్జీవమైన చర్మం. చర్మం మెరవాలంటే రోజూ కనీసం 7-9 గంటలు నిద్ర అవసరం. ఈ అలవాట్లకు తోడు.. సరైన స్కిన్‌కేర్‌ రొటీన్‌ను చేర్చుకుంటే.. కెమెరా క్లిక్‌కు ఏ సమయంలోనైనా మీరూ సిద్ధమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్