వేడుకల్లో స్నీకర్స్‌..

శీత కాలం సాయం వేళలంటేనే సెలబ్రేషన్‌ సమయాలు. నూతన సంవత్సర వేడుకలకు ముందు స్నేహితులతో టీ పార్టీలు, మైదానాల్లో ఆటలు వంటి సంతోష సమయాల్లో దుస్తులతోపాటు స్నీకర్స్‌ కూడా ప్రత్యేక అందాన్నితెస్తాయంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. ఏయే సమయాల్లో ఎటువంటి వస్త్రశ్రేణికి ఇవి నప్పుతాయో సూచిస్తున్నారు... చూడండి..

Published : 10 Dec 2022 00:45 IST

శీత కాలం సాయం వేళలంటేనే సెలబ్రేషన్‌ సమయాలు. నూతన సంవత్సర వేడుకలకు ముందు స్నేహితులతో టీ పార్టీలు, మైదానాల్లో ఆటలు వంటి సంతోష సమయాల్లో దుస్తులతోపాటు స్నీకర్స్‌ కూడా ప్రత్యేక అందాన్నితెస్తాయంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. ఏయే సమయాల్లో ఎటువంటి వస్త్రశ్రేణికి ఇవి నప్పుతాయో సూచిస్తున్నారు... చూడండి...

వార్డ్‌రోబ్‌లో దుస్తులను ఎంపిక చేసుకొనేటప్పుడు వాటిపైకి సౌకర్యవంతంగా ఉండే పాదరక్షలపైనా కాస్తంత శ్రద్ధ చూపాల్సిందే. అలాగే ఉదయం వ్యాయామాలు, పరుగు, జాగింగ్‌, నడక వంటివాటికీ సరైన పాదరక్షలు ఉంటేనే అలసట తెలియకుండా అన్నింటినీ పూర్తి చేయొచ్చు. వీటన్నింటికీ స్నీకర్స్‌ సరైన జోడీ అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని యాక్టివ్‌ వేర్‌, లేదా వర్కవుట్‌ వేర్‌ అని కూడా పిలుస్తారు. ప్రతి సందర్భానికీ సరి పోయేలా క్యాజువల్‌ నుంచి ఫార్మల్‌ దుస్తులు.. అలాగే అన్నిరకాల అవుట్‌ ఫిట్‌లపై ఇవి ఇట్టే నప్పుతాయి.

పిక్నిక్‌లకు.. పార్టీలకు, పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు క్యాజువల్‌గా ధరించే పోల్కాడాట్‌ డిజైన్స్‌ ఉన్న నారింజ, ఎరుపు వంటి ముదురు వర్ణం టాప్‌, జీన్స్‌కు చంకీ వైట్‌ స్నీకర్స్‌ సరిపోతాయి. పోల్కాడాట్స్‌తో జట్టు కట్టే స్నీకర్స్‌ కొత్త స్టైల్‌ను తెచ్చి పెడతాయి. అదే వారాంత పార్టీలకు బయలు దేరినప్పుడు పేస్టల్‌ వంటి వర్ణాల్లో ఆఫ్‌ షోల్డర్‌ టాప్‌ లేదా షర్ట్‌నెంచుకొని, మెటాలిక్‌ స్నీకర్స్‌ మ్యాచింగ్‌గా ధరిస్తే చాలు. కాంట్రాస్ట్‌గా కనిపించే ఈ మ్యాచింగ్‌తో పార్టీలో మీరే ఆకర్షణగా నిలుస్తారు.

షాపింగ్‌లో.. శుభకార్యాలు, పండగల సీజన్‌లో చేయాల్సిన షాపింగ్‌ చాలా ఉంటుంది. అప్పుడు తెలియకుండానే ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. ఇటువంటప్పుడు పాదాలకు సౌకర్యమే కాకుండా దుస్తులపై స్టైల్‌గానూ పాదరక్షలు నిలవాలి. గోధుమ, నీలం, గులాబీ వంటి లేతవర్ణంలో వదులైన టీ షర్ట్‌, సౌకర్యంగా జాగర్స్‌పై నలుపువర్ణం స్నీకర్స్‌ సరైన ఎంపిక. అలాగే స్నేహబృందంతో కలిసి సాయంకాలాల్లో బయటికి వెళుతున్నప్పుడు స్నీకర్స్‌ మరింత ఫ్యాషన్‌గా ఉండాలి. చూడటానికి సింపుల్‌గానూ అనిపించాలి. మెరిసే నియాన్‌ స్నీకర్స్‌ ఈ పార్టీలకు సరిగ్గా నప్పుతాయి. ఇంకెందుకాలస్యం.. స్నీకర్స్‌ ఎంపిక మొదలుపెట్టండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్