అడపాదడపా అలంకరణా!

కొంత మంది తరచూ మేకప్‌ వాడతారు. ఇంకొందరు పండగలూ వేడుకల్లో మాత్రమే ముఖానికి కాస్త మేకప్‌ అద్దుకుంటారు. వీరికి అలవాటు తక్కువ కాబట్టి, సరిగ్గా చేసుకోకపోతే ముఖం కళ తప్పొచ్చు. అలా కాకూడదంటే... ఈ జాగ్రత్తలు పాటించండి.

Updated : 19 Dec 2022 01:53 IST

కొంత మంది తరచూ మేకప్‌ వాడతారు. ఇంకొందరు పండగలూ వేడుకల్లో మాత్రమే ముఖానికి కాస్త మేకప్‌ అద్దుకుంటారు. వీరికి అలవాటు తక్కువ కాబట్టి, సరిగ్గా చేసుకోకపోతే ముఖం కళ తప్పొచ్చు. అలా కాకూడదంటే... ఈ జాగ్రత్తలు పాటించండి.

* సరైన ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి. అయితే దాన్ని కొనేముందు నేరుగా ముఖానికి రాసుకోకూడదు. ముందుగా కొద్దిగా తీసుకుని దవడ కింది భాగంలో రాసుకుని సహజ వెలుతురులో నిల్చోవాలి. అప్పుడే అది మీ చర్మానికి నప్పుతుందో లేదో తెలుస్తుంది. మీ చర్మరంగులో కలిసిపోతే సరే... ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా కనిపిస్తుంటే మాత్రం మీకు నప్పనట్లేదని అర్థం.

* మేకప్‌ వేసుకునేప్పుడు ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అలానే... వేసుకునే మేకప్‌ ఛాయ ఎప్పుడూ మన చర్మ రంగుకంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా కన్సీలర్‌ ఎంపికలో ఈ విషయం మరిచిపోవద్దు. పగటి పూట వేసుకుంటుంటే మేకప్‌ కాస్త తక్కువగానే ఉండాలి.

* మేకప్‌ వేసుకోవడంలో ఫౌండేషన్‌ బ్రష్‌కీ ప్రాధాన్యం ఎక్కువే. కొందరు మేకప్‌ ఆర్టిస్ట్‌లు వేళ్లతో రాసేస్తుంటారు. దానివల్ల ఫౌండేషన్‌ చక్కగా పరచుకుంటుందనేది వారి భావన కావొచ్చు. కానీ దానికంటే మంచి ఫౌండేషన్‌ బ్రష్‌ని ఉపయోగించడం ప్రయోజనకరం. లేదంటే ముఖమంతా ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా కనిపించే ప్రమాదం కూడా ఉంది.

* బ్రష్‌ని ఉపయోగించడం వల్ల అలంకరణ సరిగా రావడం లేదనుకున్నప్పుడు స్పాంజ్‌ని వాడి చూడండి. ఇలా చేయడం వల్ల సన్నగా ఉండే గీతలు సైతం కనిపించవు. మేకప్‌ ప్రారంభించడానికి ముందు తప్పని సరిగా ఎస్‌పీఎఫ్‌ ఉన్న మాయిశ్చరైజర్‌ని ఎంచుకోండి. అలానే కనీసం పది నిమిషాల ముందు దాన్ని రాసుకోవడం వల్ల మేకప్‌ చక్కగా పరుచుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్