మెడపై ముడతలకు..

ముఖంపై చిన్న మచ్చనీ తట్టుకోలేం కదూ! దాన్ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మెడను మాత్రం మరిచిపోతాం. దీంతో వృద్ధాప్యఛాయలు ముడతల రూపంలో అక్కడ కనిపిస్తుంటాయి.

Published : 24 Nov 2023 00:57 IST

ముఖంపై చిన్న మచ్చనీ తట్టుకోలేం కదూ! దాన్ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మెడను మాత్రం మరిచిపోతాం. దీంతో వృద్ధాప్యఛాయలు ముడతల రూపంలో అక్కడ కనిపిస్తుంటాయి. తప్పించుకోవాలా? ఈ చిట్కాలు పాటించేయండి.

  • సీరమ్‌, టోనర్‌, మాయిశ్చరైజర్‌.. అంటూ ముఖానికి చాలానే రాస్తాం కదా! ఈసారి నుంచి మెడనీ పట్టించుకోండి. ముఖ్యంగా పగలు రేసే క్రీముల్లో హైలురోనిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి, గ్లైకాలిక్‌ యాసిడ్‌ వంటివి ఉండేలా చూసుకోండి. రాత్రుళ్లు రెటినాల్‌ క్రీములు రాస్తే సరి. ఇవి మెడ చర్మానికి కావాల్సిన తేమను అందివ్వడమే కాదు ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే హాని నుంచీ కాపాడతాయి.
  • క్రీములను మెడ నుంచి పైకి గడ్డం వరకు రాయాలి. తరచూ కొబ్బరి, ఆలివ్‌ నూనెలతో చేసే మసాజ్‌ కూడా సాయపడుతుంది. ఆహారం ద్వారా కూడా కొలాజెన్‌ అందేలా చూసుకోవాలి. ఇంకా సన్‌స్క్రీన్‌ని మెడకి కూడా తప్పక పట్టించాలి. ఎండలో వెళ్లాల్సి వస్తే ప్రతి రెండు గంటలకోసారి రాస్తూ ఉండాలి.
  • వ్యాపకం, పని ఏదైతేనేం ఫోన్‌, కంప్యూటర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులపైనే ఆధారపడుతున్నాం. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం కూడా ఈ ముడతలకు కారణమవుతున్నాయి. అందుకే దీన్ని టెక్‌ నెక్‌, టెక్స్ట్‌ నెక్‌ అనీ పిలుస్తారు. దీన్నీ పరిశీలించుకోవాలి. తరచూ భంగిమ మార్చుకోవడం, మెడకు సంబంధించిన చిన్న వ్యాయామాలు చేసినా దీని నుంచి ఉపశమనం పొందొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్