జడ ఎలా వేస్తున్నారు?

దువ్వితే జుట్టు రాలిపోతుందని... పైపైన చిక్కులు తీసి జడ అల్లేసేవారు చాలామందే. కానీ, మాడుకి మర్దన చేసినట్లు సున్నితంగా దువ్వడమే కాదు...మరికొన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పుడే శిరోజాలు ఆరోగ్యంగా, అందంగా ఎదుగుతాయట.

Published : 15 Feb 2024 01:28 IST

దువ్వితే జుట్టు రాలిపోతుందని... పైపైన చిక్కులు తీసి జడ అల్లేసేవారు చాలామందే. కానీ, మాడుకి మర్దన చేసినట్లు సున్నితంగా దువ్వడమే కాదు...మరికొన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పుడే శిరోజాలు ఆరోగ్యంగా, అందంగా ఎదుగుతాయట.

  • తల దువ్వితే... 50-100 వెంట్రుకలు రాలడం సహజమే అంటారు వైద్యులు. అయితే, ఇంతకు మించి ఊడిపోతుంటే మాత్రం అనారోగ్యమో, పోషకాల లోపమో, శ్రద్ధవహించకపోవడమో నిర్ధరించుకోండి. ఇందుకు కారణాలు చాలానే ఉంటాయి కాబట్టి పైపై పూతలే కాదు... సమతులాహారం తీసుకోవడంతో పాటు కురుల్ని శుభ్రంగా, చిక్కులు లేకుండా ఉంచుకోవడమూ తప్పనిసరి.
  • కొందరు బలంగా దువ్వి, లాగి బిగుతుగా జడ వేస్తుంటారు. ఇలాంటప్పుడు జుట్టు మరింతగా రాలే అవకాశం ఉంది. అలానే, హడావుడిగానో, బలంగా ఒత్తిపెట్టో అదీ లేదంటే తడి తలమీద దువ్వేయడం చేస్తున్నా ఈ సమస్య తప్పకపోవచ్చు. బదులుగా, కాస్త సమయం తీసుకునైనా సరే,  వెడల్పాటి పళ్లున్న దువ్వెనతోనో, వేళ్లతోనో చిక్కుల్ని తీశాకే హెయిర్‌స్టైలింగ్‌ చేసుకోండి. మరీ ఎక్కువగా చిక్కు పడితే...  సీరమ్‌ రాసి విడదీయండి.
  • సహజంగా నూనెల్ని విడుదల చేసే సెబేషియస్‌ గ్రంథులు దువ్వినప్పుడు ప్రేరేపితమవుతాయి. దాంతో శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకే, మాడుపై దుమ్ము చేరకుండా తరచూ తలస్నానం చేయడంతో పాటు వెడల్పాటి దువ్వెనతో సున్నితంగా దువ్వడమూ ముఖ్యమే.
  • దువ్వడమంటే నేరుగా మాడు నుంచే మొదలుపెడుతున్నారా? అదెప్పుడూ మంచి పద్ధతి కాదు. కింది నుంచి ఆరంభించి నెమ్మదిగా పైకి రావాలి. అప్పుడు కురులపై ప్రయోగించే బలం తగ్గుతుంది. ఫలితంగా ఊడదు. ఇంకా చిట్లడం, తెగడం లాంటి సమస్యలూ తగ్గుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్