అరె.. గడువు ముగిసింది!

‘ఒకటి కొంటే మరొకటి ఫ్రీ’ అనో, ‘ముందే కొనిపెట్టేసుకుంటే నయం’ అని బ్యూటీ ఉత్పత్తులు స్టాక్‌ పెట్టుకుంటూ ఉంటాం కదా! కొన్నిసార్లు ఎక్కడో పెట్టి మర్చిపోతాం. తీరా చూసుకునే సరికి ఎక్స్‌పైరీ అవుతుంటాయి. ఇలాంటి అనుభవం మీకూ అయ్యిందా? అంతంత డబ్బు పోసి కొంటాం.

Updated : 18 Feb 2024 06:04 IST

‘ఒకటి కొంటే మరొకటి ఫ్రీ’ అనో, ‘ముందే కొనిపెట్టేసుకుంటే నయం’ అని బ్యూటీ ఉత్పత్తులు స్టాక్‌ పెట్టుకుంటూ ఉంటాం కదా! కొన్నిసార్లు ఎక్కడో పెట్టి మర్చిపోతాం. తీరా చూసుకునే సరికి ఎక్స్‌పైరీ అవుతుంటాయి. ఇలాంటి అనుభవం మీకూ అయ్యిందా? అంతంత డబ్బు పోసి కొంటాం. పడేయాలంటే మనసు బాధపడుతుంది కదూ! పోనీ ఇలా వాడేద్దాం.

  • స్కిన్‌ కేర్‌ రొటీన్‌ మొదలయ్యేదే క్లెన్సర్‌తో కదా! అదే గడువు తీరితే వాడాలంటే భయమేస్తుంది కదూ! దాన్ని ఇతర వస్తువుల శుభ్రతకి వాడొచ్చని తెలుసా? మేకప్‌ బ్రష్‌లు, ట్యాప్‌లను దీంతో క్లీన్‌ చేస్తే సరి. జిడ్డు వదలడమే కాదు, తేలిగ్గా శుభ్రమవుతాయి.
  • మాయిశ్చరైజర్‌ని అయితే పాదాలు, మోకాళ్లూ మోచేతులకు వాడొచ్చు. ముఖంతో పోలిస్తే అక్కడి చర్మం కాస్త మందంగా ఉంటుంది. కాబట్టి, తట్టుకుంటుంది. అయినా రిస్క్‌ తీసుకోలేమంటారా? అయితే హ్యాండు బ్యాగుల శుభ్రతకు వాడేయండి. మెత్తని వస్త్రంపై కొద్దిమొత్తంలో మాయిశ్చరైజర్‌ తీసుకొని, దాంతో పైన తుడిస్తే సరి. మెరుపు కోల్పోవు. అయితే లెదర్‌ బ్యాగులు... ముదురు రంగులవి శుభ్రం చేసేప్పుడు జాగ్రత్త. కాస్త రంగు మారే అవకాశముంది.
  • టోనర్లు సాధారణంగా కాస్త పెద్ద బాటిల్‌లోనే వస్తుంటాయి. ఆన్‌లైన్‌ షాపింగులోనేమో తేదీ చెక్‌ చేసుకునే వీలుండదు. పొరపాటున వచ్చాకా చెక్‌ చేసుకోలేదో... అది పూర్తయ్యేలోపు గడువు ముగిసే దాఖలాలెన్నో. అదికాకపోయినా కొన్నిసార్లు చర్మతీరుకు సరిపడకపోవచ్చు. దాంతో పక్కన పెట్టేస్తాం. అదీ వృథానేగా! వాటితో అద్దం, ఫర్నీచర్‌, షూ, చెక్క వస్తువులు తుడిచి చూడండి. మెరవడం ఖాయం.
  • ఫ్లేవర్‌ నచ్చిందని ఒకటి, ఎప్పుడూ అందుబాటులో ఉండాలని బ్యాగులోకొకటి... ఇలా ఎక్కువ కొనేవాటిల్లో లిప్‌బామ్‌ ఒకటి. ఇది సరిపడకపోయినా, ఎక్స్‌పైరీ అయినా బాధపడనక్కర్లేదు. గోళ్లపక్కన చర్మం తరచూ పొడిబారడం, కాళ్ల పగుళ్ల లాంటి సమస్యలున్నాయా? వాటికి వాడిస్తే సరి. సమస్యా తీరుతుంది, డబ్బు వృథా అయిందన్న బాధా ఉండదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్