చీరపై... రామ చిత్రాలెన్నో!

శ్రీరామ నవమి పండగను దేశమంతా సంబరంగా జరుపుకొంటుంది. భక్తిని చాటడంలో ఎవరి తీరు వారిదే అయినా... మహిళలుగా మన ప్రత్యేకత ఉండాలి కదా! దాన్ని చూపించడానికే శ్రీరామ పెయింటింగ్‌ చీరలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

Published : 17 Apr 2024 14:28 IST

శ్రీరామ నవమి పండగను దేశమంతా సంబరంగా జరుపుకొంటుంది. భక్తిని చాటడంలో ఎవరి తీరు వారిదే అయినా... మహిళలుగా మన ప్రత్యేకత ఉండాలి కదా! దాన్ని చూపించడానికే శ్రీరామ పెయింటింగ్‌ చీరలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ మధ్య అబ్బురపరిచేలా రామాయణ ఘట్టాలనూ చిత్రిస్తున్నారు. ఆ మధ్య అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠకు ఆలియాభట్‌ రామ కథతో తీర్చిదిద్దిన మైసూర్‌ సిల్క్‌ చీర కట్టింది. ఇప్పుడు సామాన్య మహిళలూ... ఈ ప్యాషన్‌ని ఫాలో అయిపోతున్నారు. స్క్రీన్‌, బ్లాక్‌ ప్రింటింగ్‌లే కాదు... మధుబని, కలంకారీ, పట్టచిత్ర...వంటి వాటి సాయంతోనూ కళ్లకు కట్టేలా చీరలపై రామాయణ ఘట్టాలను ప్రదర్శిస్తున్నారు. రంగు రంగుల పట్టు దారాలతో చీర కొంగులూ, అంచులూ... అన్నింటిపైనా రామ నామ జపం చేస్తున్నారు. సీతాదేవి జన్మస్థలమైన మిథిలలో మొదలైన మధుబని కళలో రామాయణ ఘట్టాల చిత్రణే కీలకం. ఎందుకంటే ఒకప్పుడు అలంకరణ కళగా భావించిన ఇది కాలక్రమంలో ఫ్యాషన్‌ బాటలోనూ నడుస్తోంది. భక్తితో మైమరిచేలా చేస్తోంది. కలంకారీ కూడా అలాంటిదే. హరప్పా నాగరికత బయటపడినప్పుడే దీని ఆధారాలు లభించాయట. ఈ పురాతనమైన పెయింటింగ్‌లో ఎన్నో రకాలున్నా... చీరలపై రామాయణ గాథల్ని ప్రత్యేకంగా శ్రీకాళహస్తిలో తయారుచేస్తారు. ఒడిశా పట్టచిత్ర కళలోనూ రామ చరితను చూపించేలా తీర్చిదిద్దిన చీరలకు ఆదరణ ఎక్కువ. అటు సంప్రదాయాన్నీ, ఇటు ఫ్యాషన్‌నీ చూపిస్తూనే, భక్తితత్త్వాన్నీ ప్రదర్శించేలా వీటిని ఎంచుకుంటోంది ఈతరం. బాగుంది కదూ! మీరూ ప్రయత్నించేయండి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్