గోళ్లు విరుగుతున్నాయా?

గోళ్లు పెళుసుబారటం సాధారణంగా మహిళల్లో ఎక్కువే. నీళ్లలో ఎక్కువగా నానడం, మాటిమాటికీ చేతుల్ని కడగడం, రక్తహీనత, ఐరన్‌, కాల్షియం లోపంతో గోళ్లు బలహీనమై మధ్యకి విరిగిపోతుంటాయి. ఈ ఇబ్బందికి చెక్‌ పెట్టేసే టూల్స్‌ ఇవి... చేతిగోళ్లను కత్తిరించుకుని, పనుల్లోకి దిగామో... చివరలు చిట్లడం, మధ్యకి విరిగిపోవడం వంటి చిక్కులు తప్పకపోవచ్చు.

Published : 23 Apr 2024 01:35 IST

గోళ్లు పెళుసుబారటం సాధారణంగా మహిళల్లో ఎక్కువే. నీళ్లలో ఎక్కువగా నానడం, మాటిమాటికీ చేతుల్ని కడగడం, రక్తహీనత, ఐరన్‌, కాల్షియం లోపంతో గోళ్లు బలహీనమై మధ్యకి విరిగిపోతుంటాయి. ఈ ఇబ్బందికి చెక్‌ పెట్టేసే టూల్స్‌ ఇవి...

సాన పెట్టేద్దాం...

చేతిగోళ్లను కత్తిరించుకుని, పనుల్లోకి దిగామో... చివరలు చిట్లడం, మధ్యకి విరిగిపోవడం వంటి చిక్కులు తప్పకపోవచ్చు. ఇలాంటప్పుడు నెయిల్‌ ఫైల్స్‌ లేదా బఫర్స్‌ని వాడితే సరి. ఈ కిట్‌లో ఆరు రకాల గరుకైన షీట్లు ఉంటాయి. ఎలా ఉపయోగించాలో క్రమం దానిమీదే రాసి ఉంటుంది. గోళ్లను ఆ వరుసలో దానిపై సానపెట్టి, నచ్చిన ఆకృతిలో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

మృదువుగా మారుస్తాయి...

గోళ్లు పెళుసుబారినప్పుడు... వాటికి కాస్త పోషణ కావాలి. సంబంధిత నూనెలు, కండిషనర్లు ఇప్పుడు పెన్నుల రూపంలో దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకోండి. లేదా విటమిన్‌ ఇ, బాదం నూనెలను వాడినా మంచిదే.

నీళ్లలో ఎక్కువ సమయం పనిచేయడం వల్లో తోటపని చేసేటప్పుడో గోళ్లు ఎక్కువగా విరిగిపోతుంటాయి. ఈ పరిస్థితి రాకుండా హౌస్‌వైఫ్‌ గ్లౌజులు, జెల్‌ ఫింగర్‌ కాట్స్‌ను తెచ్చుకుంటే గోళ్లకు తొడుగులుగా ఉపయోగ పడతాయివి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్