మేకప్‌ మరకలా?

వేడుకలన్నాక కాస్త మేకప్‌ టచ్‌ లేకపోతే ఎలా? సమస్యల్లా ఆ సందడిలోపడి ఆదమరిచినప్పుడే! గమనించుకోకుండా కాటుకో, లిప్‌స్టిక్కో దుస్తులకు అంటిందో... వదిలించడం పెద్ద తలనొప్పి.

Published : 07 May 2024 01:38 IST

వేడుకలన్నాక కాస్త మేకప్‌ టచ్‌ లేకపోతే ఎలా? సమస్యల్లా ఆ సందడిలోపడి ఆదమరిచినప్పుడే! గమనించుకోకుండా కాటుకో, లిప్‌స్టిక్కో దుస్తులకు అంటిందో... వదిలించడం పెద్ద తలనొప్పి. సులువుగా పోగొట్టే మార్గాలు కావాలా... అయితే చదివేయండి.

  •  హైనెక్‌ కాలర్‌ డ్రెస్‌ వేసుకున్నారా? మనం ప్రత్యేకంగా అంటించుకోనక్కర్లేదు. మెడకు వేసిన ఫౌండేషన్‌, కాంపాక్ట్‌ చక్కగా దుస్తులకు అతుక్కుపోతుంది. లేత దుస్తులైతే మరకలు మరింత బాగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఒక చిన్న గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని దానికి కొద్దిగా లిక్విడ్‌ డిష్‌వాష్‌ను కలపాలి. దూదిని ఆ నీటిలో ముంచి, నెమ్మదిగా మరక ఉన్న ప్రాంతంలో రుద్దకుండా సున్నితంగా అద్దాలి. దూదితోపాటుగా మేకప్‌ వచ్చేస్తుంది. అవసరమైతే దూదిని మార్చుకుంటే సరిపోతుంది.
  • చూసుకోకుండా లిప్‌స్టిక్‌, మస్కారా, ఐ లైనర్‌ పూసేసుకున్నారా? ఇంట్లో షేవింగ్‌ ఫోమ్‌ ఉంటే సమస్య తీరినట్లే. షేవింగ్‌ ఫోమ్‌ని మరక ఉన్నచోట రాసి, పావుగంట వదిలేయండి. తరవాత దూదితోగానీ శుభ్రమైన వస్త్రంతోగానీ ఫోమ్‌ని తుడిచేయాలి. ఆపై చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇంకా ఆనవాళ్లు కనిపిస్తోంటే మరోసారి ఈ ప్రక్రియను అనుసరిస్తే సరి.
  • నెయిల్‌ పాలిష్‌ అంటితే... రెండు దూది ఉండలను తీసుకొని నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌లో ముంచాలి. మరక ఉన్న ప్రాంతంలో వస్త్రానికి ఇరువైపులా వాటిని ఉంచి కొద్దిసేపు అద్దితే చాలు. అదే ఊడొస్తుంది.
  •  ముదురు రంగు దుస్తులు వేసుకుని... అలా అలా పౌడర్‌ ఫౌండేషన్‌తో టచప్‌ ఇద్దామనుకున్నామనుకోండి. అది పొరపాటున వాటిపై పడితే తిప్పలు మామూలుగా ఉండవు. దుస్తులపై తెల్లని పొరలా ఎంతసేపటికీ వదలదు. అలాంటప్పుడు చేతులకు కాకుండా హెయిర్‌ డ్రైయ్యర్‌కి పనిచెప్పండి. దాంతో బ్లో చేస్తే... ఆనవాళ్లు లేకుండా పౌడర్‌ వదిలిపోతుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్