జీన్స్‌ ఎక్కువకాలం మన్నడం లేదా?

ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళల క్యాజువల్‌ వేర్‌గా జీన్స్‌ మారిపోయింది. అయితే, వీటినీ సరిగా ఉంచుకోకపోతే అవి ఎక్కువకాలం నాణ్యంగా, మన్నికగా ఉండవు. ఈ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలిలా తీసుకోవాలి.

Published : 26 May 2024 00:59 IST

ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళల క్యాజువల్‌ వేర్‌గా జీన్స్‌ మారిపోయింది. అయితే, వీటినీ సరిగా ఉంచుకోకపోతే అవి ఎక్కువకాలం నాణ్యంగా, మన్నికగా ఉండవు. ఈ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలిలా తీసుకోవాలి.

  • మొదటి సారి జీన్స్‌ నానబెట్టే సర్ఫ్‌ నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పు కూడా వేయండి. ఇలా చేస్తే రంగు పోకుండా ఉంటుంది. మురికీ, మరకలూ త్వరగా వదులుతాయి. కొత్తదనమూ పోదు.  
  • ముదురు రంగు జీన్స్‌లు మెరుపు తగ్గుతున్నాయా? అయితే వాటిని ఉతికిన తరవాత చివరిలో అరబకెట్‌ నీటిలో కప్పు బేకింగ్‌ సోడా కలిపి ముంచి తీసి ఆరేయండి చాలు. మరకలు పడితే రెండు చెంచాల వంటసోడాలో కాస్త వినెగర్‌ కలిపి పేస్టులా చేసి మరక మీద రాయాలి. పావుగంటయ్యాక బ్రష్‌తో రుద్దితే త్వరగా వదిలిపోతుంది.
  • జీన్స్‌ కాస్త మందంగా ఉంటుంది కదా అని... వేణ్నీళ్లల్లో నానబెట్టడం, బండకేసి బాదడం చేయొద్దు. దీనివల్ల దాని షైనింగ్‌తో పాటు మన్నికా తగ్గుతుంది. వీలైనంతవరకూ వీటిని చన్నీళ్లతోనే ఉతకాలి.  అలానే జీన్స్‌ని వేసుకున్న ప్రతిసారీ ఉతికేయొద్దు. గాలికి ఆరనిచ్చి రెండు మూడు సార్లు వేసుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్