హెయిర్‌ స్ట్రెయిట్‌నింగ్‌ చేయిస్తుంటే...

ఉంగరాల జుట్టు చూడటానికి బాగున్నా దాంతో అంత ఈజీ కాదు. సహజంగానే ఓ పట్టాన చిక్కులు రావు. ఇక తలస్నానం చేసినప్పుడయితే ఆ బాధ వర్ణనాతీతం. చాలామంది అది పడలేకే స్ట్రెయిట్‌నింగ్‌ వైపు అడుగులు వేస్తుంటారు. ఏవేవో ప్రయత్నాలు చేసి స్ట్రెయిట్‌ చేయించినా కొద్ది రోజులకే మళ్లీ మొదటికొస్తుంది.

Published : 26 May 2024 01:03 IST

ఉంగరాల జుట్టు చూడటానికి బాగున్నా దాంతో అంత ఈజీ కాదు. సహజంగానే ఓ పట్టాన చిక్కులు రావు. ఇక తలస్నానం చేసినప్పుడయితే ఆ బాధ వర్ణనాతీతం. చాలామంది అది పడలేకే స్ట్రెయిట్‌నింగ్‌ వైపు అడుగులు వేస్తుంటారు. ఏవేవో ప్రయత్నాలు చేసి స్ట్రెయిట్‌ చేయించినా కొద్ది రోజులకే మళ్లీ మొదటికొస్తుంది. పైగా ఆ సమయంలో వాడే రసాయనాలు భవిష్యత్తులో కిడ్నీలపై ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. జుత్తుకి తీసుకునే ట్రీట్‌మెంట్‌ వల్ల శరీర భాగాలు పాడవడమేంటి అనుకుంటున్నారా? అయితే దీనికి ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. ఓ మహిళ మూడేళ్లలో మూడుసార్లు స్ట్రెయిట్‌నింగ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుందట. అలా తీసుకున్న ప్రతిసారీ వాంతులు, విరేచనాలు, జ్వరం, వెన్నునొప్పి లాంటివి వచ్చి విపరీతంగా బాధని అనుభవించిందట. అంతేనా.. స్ట్రెయిట్‌నింగ్‌ ట్రీట్‌మెంట్‌లో వాడే క్రీముల్లో ఉండే గ్లైఆక్సిలిక్‌ ఆమ్లం చర్మం ద్వారా శరీరంలోకి చొచ్చుకెళ్లి ఆక్సిలిక్‌ ఆమ్లాన్ని విడుదల చేస్తుందట. దానివల్ల కాల్షియం అధికమై చిన్న చిన్న క్రిస్టల్స్‌గా తయారై కిడ్నీలు పాడయ్యాయట. అందుకే దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు స్ట్రెయిట్‌నింగ్‌కు దూరంగా ఉండటమే మంచిది. సాధారణంగా ఈ అలవాటు ఉన్నవారు మూడు నుంచి నాలుగు నెలలపాటు విరామం తీసుకోవాలి. వెంటవెంటనే తీసుకోవడం వల్ల జుట్టూ పాడవుతుంది, ఆరోగ్యమూ దెబ్బతింటుంది. రసాయనాలపాళ్లు అధికంగా ఉన్నవీ, గడువు ముగిసిన ఉత్పత్తులూ వాడి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దంటున్నారు పరిశోధకులు. మీ శరీరానికి ఏం కావాలో ఏం వద్దో మీకు ఓ అంచనా ఉంటుంది. ఏదైనా రసాయనాలు పడటం లేదు అనిపించినప్పుడు దానికి దూరంగా ఉండండి. తప్పదు అనుకున్నప్పుడు ఏవైనా ఇంటి చిట్కాలు ప్రయత్నించండి. అంతేతప్ప బాధని భరించి ప్రయోగాలు చేయకండి. అది ఎప్పటికైనా మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని గమనించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్