మళ్లీ మళ్లీ మర్చిపోతుంటే..

పని ఒత్తిడిలో పడి చిన్న చిన్న విషయాలు మర్చిపోతుండటం మనకు మామూలే. కానీ బాగా గుర్తుండిపోయే, ఎప్పటికీ మర్చిపోలేని వాటినీ మర్చిపోతున్నామంటే జాగ్రత్త పడాలి అంటున్నారు న్యూరోసైంటిస్టులు. దాన్నుంచి తప్పించుకోవడానికి మార్గాలను సూచిస్తున్నారు.

Updated : 15 Jun 2022 03:58 IST

పని ఒత్తిడిలో పడి చిన్న చిన్న విషయాలు మర్చిపోతుండటం మనకు మామూలే. కానీ బాగా గుర్తుండిపోయే, ఎప్పటికీ మర్చిపోలేని వాటినీ మర్చిపోతున్నామంటే జాగ్రత్త పడాలి అంటున్నారు న్యూరోసైంటిస్టులు. దాన్నుంచి తప్పించుకోవడానికి మార్గాలను సూచిస్తున్నారు.

* వెనక్కి నడవండి.. రోజూ కొద్దిసేపు వెనక్కి నడుస్తూ ఆరోజు చేయాల్సిన పనులు, గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలను మననం చేసుకోండి. వాటిని తప్పక గుర్తుంచుకుంటారు అంటున్నారు నిపుణులు. ఈ చర్య మెదడులో విషయాలు మామూలు దానికంటే భిన్న ప్రాంతాల్లో నిక్షిప్తం అయ్యేలా చేస్తుందట. దీంతో మరచిపోవడానికి ఆస్కారం చాలా తక్కువని చెబుతున్నారు.

* వాటిని తింటే.. ఆహారంలో పండ్లు, కూరగాయలకు ముఖ్యంగా ముదురు నారింజ, ఎరుపు రంగులో ఉండేవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. రోజుమార్చి రోజు ఆకుకూరలు, బెర్రీలను ఎక్కువగా తీసుకుంటే సరి.

* వెలుతురు.. భద్రత, అందం దృష్ట్యా ఎప్పుడూ తలుపులు, కర్టెన్లు మూసేయడం వంటివి చేస్తుంటాం. దీంతో ఇంట్లో తగినంత వెలుతురు ఉండదు. తక్కువ వెలుతురూ మెదడుపై ప్రభావం చూపి, మతిమరుపుకు కారణమవుతుంది. కాబట్టి, నివసించే ప్రదేశంలో వెలుతురు ఉండేలా చూసుకోవడం, ఉదయాన్నే ఎండలో కాసేపు ఉండటం వంటివి చేయాలి.

* ఉపవాసం.. ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌.. ఈమధ్య ఎక్కువమంది ఆసక్తి చూపుతున్న విధానమిది. వీలునుబట్టి 8, 12, 24 గంటలు ఉపవాసం ఉండటమన్నమాట. ఇదీ మతిమరుపును దూరం చేయడంలో సాయం చేస్తుందట.

* చివరగా.. ముఖ్యమైన విషయాలను మర్చిపోవడం ఆందోళన కలిగించే విషయమే! కానీ దాన్నే పట్టుకొని కూర్చొంటే.. ఆస్తమానూ ఆలోచిస్తోంటే మెదడుపై మరింత నెగెటివ్‌ ప్రభావానికి కారణమవుతుందట. దీంతో సమస్య పెరగడమే తప్ప తగ్గదు. కాబట్టి, వీలైనంత వరకూ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్