అమ్మపాలు అందకుంటే...

వ్యాధి నిరోధక శక్తిని అందించి బిడ్డను శక్తిమాన్‌లా మార్చే విషయంలో అమ్మపాలకు ప్రత్యామ్నాయం లేదు. ఆ అవగాహన లేక కొందరు బిడ్డకు చనుబాలను దూరం చేస్తున్నారు. తల్లిపాలు అందకపోతే కలిగే నష్టాలు గురించి తెలిస్తే ఆ పొరపాటు మళ్లీ చేయరు..

Updated : 03 Aug 2022 03:22 IST

వ్యాధి నిరోధక శక్తిని అందించి బిడ్డను శక్తిమాన్‌లా మార్చే విషయంలో అమ్మపాలకు ప్రత్యామ్నాయం లేదు. ఆ అవగాహన లేక కొందరు బిడ్డకు చనుబాలను దూరం చేస్తున్నారు. తల్లిపాలు అందకపోతే కలిగే నష్టాలు గురించి తెలిస్తే ఆ పొరపాటు మళ్లీ చేయరు..

బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు అందేట్టు జాగ్రత్తపడాలి. తొలి ఆరునెలలూ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అక్కడ నుంచి రెండేళ్లు లేదా వీలైనంతకాలం తక్కిన ఆహారంతోపాటు తల్లిపాలూ ఇస్తే మంచిది.

* సరైన సమయానికి తల్లిపాలని బిడ్డకు అందించగలిగితే ఏటా లక్ష మంది శిశువులని మనం కాపాడుకోవచ్చు.

* తల్లిపాలు అందకపోవడం వల్ల పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి లోపిస్తుంది. ఈ కారణంగా ఏటా 3.5 కోట్లమంది పిల్లలు నీళ్ల విరేచనాల బారినపడుతున్నారు.  

 ఇంకా...

* 25 లక్షల మంది చిన్నారులు... న్యుమోనియా బారిన పడుతున్నారు.

* 40వేలమంది పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నారు.

* పిల్లల్లో వచ్చే అనారోగ్యాలు నయం చేసేందుకు అవుతున్న ఖర్చు... రూ. 832 కోట్లు. 

* బిడ్డకు పాలివ్వకపోవడంవల్ల ఏటా ఏడువేలమంది రొమ్ము క్యాన్సర్‌కు గురవుతుంటే 87వేలమంది మధుమేహ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

ఆధారం: ది బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌ వర్క్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్