ఆరోగ్యంతో.. ప్రతిరోజూ పండగే!

పండగల సీజన్‌ మొదలైంది. సుదూర ప్రయాణాలూ, నోరూరించే పిండి వంటలూ.. వీటిలో పడి ఫిట్‌నెస్‌ సంగతే మర్చిపోతాం. ఇలా కొద్ది వారాలైనా వ్యాయామాలూ, ఆహార నియమాలకు దూరమైతే

Published : 26 Sep 2022 00:23 IST

పండగల సీజన్‌ మొదలైంది. సుదూర ప్రయాణాలూ, నోరూరించే పిండి వంటలూ.. వీటిలో పడి ఫిట్‌నెస్‌ సంగతే మర్చిపోతాం. ఇలా కొద్ది వారాలైనా వ్యాయామాలూ, ఆహార నియమాలకు దూరమైతే చాలు అంత త్వరగా శరీరాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురాలేమని హెచ్చరిస్తున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అలా కాకుండా ఏం చేయాలంటే..

రోజులో కనీసం 10-15 నిమిషాలైనా వ్యాయామానికి కేటాయించాలి. తేలికపాటి బరువులెత్తడం, రన్నింగ్‌, నడక, మెట్లు ఎక్కడం, యోగా.. ఇవన్నీ అందులోకి వస్తాయి. ఈ సమయంలో నిద్రవేళలు మారుతుంటాయి. కాబట్టి ఉదయం 10-11, సాయంత్రం 5-6 ఎప్పుడు వీలుంటే అప్పుడు వ్యాయామం చేయండి. ఇలా చేయడంవల్ల మళ్లీ మొదటినుంచి ప్రారంభించాల్సిన ముప్పు తప్పుతుంది.

* పండగల్లో ఆటాపాటా భాగమే. బతుకమ్మ, దాండియా.. వీటిలో పాల్గొనే అవకాశం వస్తే వదలొద్దు. ఎందుకంటే ఆ సమయంలో ఉల్లాసం, ఉత్సాహంతోపాటే వ్యాయామమూ పూర్తవుతుంది.

* వ్యాయామం చేయకపోవడం ఒక సమస్య అయితే తిండి విషయంలో నియంత్రణ లేకపోవడం మరో సమస్య. ముఖ్యంగా పండగల్లో ఇంటి వంటలు నోరూరిస్తాయి. అయితే వాటికి పరిమితి పెట్టుకోండి. లేకపోతే పిండి వంటలు తిన్నాక ఆ పూట మితంగా భోజనం చేయండి. పండక్కి ముందునుంచే రోజూ పిండి వంటలు తినకుండా పండ్లు, సలాడ్లు తీసుకోండి. ఎక్కువగా ఒత్తిడికి గురవ్వొద్దు, అలసిపోవద్దు.. అలా చేస్తే ఇంకా ఎక్కువగా తినేస్తారు.

* కొన్ని వంటకాల్లో తియ్యదనం కోసం పంచదారకు బదులు కర్జూరం, తేనె, కిస్మిస్‌ లాంటివి వాడొచ్చు. విత్తనాలు, మొలకల్లాంటివీ తీసుకోండి. ఇవన్నీ చేస్తూనే ఎప్పటికప్పుడు నీళ్లు తాగండి. ఇలా చేస్తే సీజన్‌ మొత్తం ప్రతిరోజూ పండగే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్