అమ్మా.. జలుబా?

అసలే చలికాలం.. అడపాదడపా చినుకులతో వాతావరణం మరింత చల్లగా మారిపోతోంది కదూ! ఇలాంటప్పుడు సహజంగానే జలుబు, దగ్గు పలకరించేస్తుంటాయి. మామూలు వాళ్లకి సరే కానీ గర్భిణులకే ఎక్కువ సమస్య. దీనికి జ్వరం కూడా తోడైతే..

Published : 29 Nov 2023 01:36 IST

అసలే చలికాలం.. అడపాదడపా చినుకులతో వాతావరణం మరింత చల్లగా మారిపోతోంది కదూ! ఇలాంటప్పుడు సహజంగానే జలుబు, దగ్గు పలకరించేస్తుంటాయి. మామూలు వాళ్లకి సరే కానీ గర్భిణులకే ఎక్కువ సమస్య. దీనికి జ్వరం కూడా తోడైతే..

  • జలుబు రావడానికి ముందు గొంతు నొప్పిగా అనిపిస్తుంది. అప్పటినుంచే జాగ్రత్తలు మొదలవ్వాలి. వేడినీటితో రెండు నిమిషాలు ఆవిరి పడితే చాలావరకూ ఉపశమనం ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించినా గొంతు నొప్పి త్వరగా అదుపులోకి వస్తుంది.
  • గర్భిణిగా ఉన్నప్పుడు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అలాగని నీరు తాగకుండా ఉండొద్దు. గోరువెచ్చని నీటితోపాటు విటమిన్‌ సి ఎక్కువగా లభించే పండ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
  • నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్లు అందుతాయి. కళ్లు తిరిగినట్లుగా అనిపించకుండా ఉంటుంది. దగ్గుకు సహజ పరిష్కారం కూడా.
  • ఈ సమయంలో మామూలుగానే కాస్త మగతగా ఉంటుంది. పని పేరుతో అశ్రద్ధ చేయకుండా.. వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. కాస్త తల ఎత్తుగా పెట్టుకొంటే శ్వాస ఇబ్బందులు ఉండవు. రాత్రి నిద్రపోయే ముందు పాలల్లో పసుపు వేసుకొని తాగితే సరి. జలుబు నుంచీ ఉపశమనం. సుఖనిద్రా పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్