కళ్లు ఎర్రబడుతుంటే..!

కళ్లు తగినంత కన్నీటిని ఉత్పత్తి చేయనప్పుడూ, లూబ్రికేషన్‌ అందనప్పుడూ డ్రై ఐ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. దీనివల్ల ఒక్కోసారి కళ్లలో మంట, దురద, ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవడం జరుగుతుంది. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ కింది చిట్కాలను పాటిస్తే సరి.

Updated : 14 Feb 2024 04:27 IST

కళ్లు తగినంత కన్నీటిని ఉత్పత్తి చేయనప్పుడూ, లూబ్రికేషన్‌ అందనప్పుడూ డ్రై ఐ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. దీనివల్ల ఒక్కోసారి కళ్లలో మంట, దురద, ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవడం జరుగుతుంది. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ కింది చిట్కాలను పాటిస్తే సరి..

శుభ్రం చేయడం.. కాటన్‌ వస్త్రాన్ని గోరువెచ్చని నీళ్లలో ముంచి నీటిని పిండాలి. కళ్లపై ఐదు నిమిషాలు ఉంచి, వృత్తాకారంలో కనురెప్పలపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కంటిలో ఉండే దుమ్మూధూళీ బయటకు వచ్చేస్తాయి. ఇలా రోజులో కనీసం మూడు సార్లు చేయాలి.

కొబ్బరినూనె.. కళ్లు తేమను కోల్పోకుండా ఇది కాపాడుతుంది. అంతేకాదు ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పొడిబారడం వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. కొబ్బరి నూనెలో దూదిని ముంచి మూసి ఉన్న కనురెప్పలపై 15 నిమిషాలు ఉంచాలి. ఇలా ఉపశమనం కలిగేంత వరకూ రోజులో ఎన్నిసార్లైనా చేయవచ్చు.

కలబంద గుజ్జు... ఇందులో ఉండే ఆల్కలీన్‌ గుణాలు కళ్లను తేమపూరితం చేస్తాయి. దీనిలోని మాయిశ్చరైజింగ్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎరుపు తద్వారా వచ్చే వాపును తగ్గిస్తాయి. ఇందుకుగానూ కలబంద గుజ్జు తీసుకుని కంటి చుట్టూ సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి. రోజుకి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

రోజ్‌వాటర్‌.. ఒత్తిడి వల్ల అలసిపోయిన కంటికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్‌-ఎ లోపం వల్ల కళ్లు పొడిబారుతుంటాయి. రోజ్‌వాటర్‌లో విటమిన్‌-ఎ పుష్కలంగా ఉంటుంది. గులాబీ నీళ్లలో దూది ఉండల్ని నాననివ్వాలి. వాటిని కళ్లపై పదినిమిషాలు ఉంచాలి. తరవాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. రోజులో కనీసం మూడు సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.

పోషకాహారం.. పైవాటితో పాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. చేపలు, అవిసెలు, వాల్‌నట్స్‌తోపాటు ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటిలో తేమ పెరుగుతుంది. దీంతో కంటి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్