పీసీఓఎస్‌ పరిష్కారానికి దాల్చిన చెక్క!

సుగంధ ద్రవ్యాల్లో కీలకమైనది దాల్చిన చెక్క. వంటకాలకు రుచినీ, చక్కటి అరోమానూ అందించే దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఔషధగుణాలూ ఎక్కువే. మరి దీన్ని తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా.

Published : 23 Feb 2024 04:33 IST

సుగంధ ద్రవ్యాల్లో కీలకమైనది దాల్చిన చెక్క. వంటకాలకు రుచినీ, చక్కటి అరోమానూ అందించే దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఔషధగుణాలూ ఎక్కువే. మరి దీన్ని తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా...

  • దాల్చిన చెక్క వాతాన్ని తగ్గిస్తుంది. అజీర్తిని అదుపులో ఉంచుతుంది. ఇందుకోసం రోజూ ఉదయాన్నే కొద్దిగా తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తినండి. అజీర్తి తగ్గి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
  • ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చెంచా నిమ్మరసం, చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి తాగితే బరువు అదుపులో ఉంటుంది. వయసు పైబడిన మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆర్థరైటిస్‌ సమస్య అదుపులో ఉంటుంది. కీళ్లనొప్పులూ తగ్గుతాయి.
  • దాల్చిన చెక్క శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. దీన్ని రోజువారీ ఆహారంలో కొన్నాళ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. గుండె ఆరోగ్యంగానూ ఉంటుంది.
  • మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో దాల్చిన చెక్కను వాడితే మంచిది. ఇది రక్తంలోని చక్కెర నిల్వల్ని అదుపు చేస్తుంది. ఇందులోని అలనిన్‌ అనే ఎంజైమ్‌ ఆహారం తిన్న వెంటనే శరీరం గ్లూకోజ్‌ను గ్రహించకుండా చేయగలదు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జలుబుని తగ్గిస్తాయి.
  • దాల్చిన చెక్కలో ఉండే కౌమారిన్‌ అనే కాంపౌండ్‌కి సహజంగా రక్తాన్ని పలుచబరిచే గుణం ఉంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యలు అదుపులోకి వస్తాయి. నోట్లోని సూక్ష్మ క్రిముల్ని నాశనం చేసి దుర్వాసనను అరికడుతుంది.
  • పీసీఓఎస్‌ సమస్యతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. నెలసరి సక్రమంగా వస్తుంది. ఆ సమయంలో వచ్చే వికారం, కడుపు నొప్పి వంటివి తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఇందుకోసం రోజూ ఆహారంపై పొడిలా చల్లుకుని తిన్నా మంచిదే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్