యూనిఫామ్‌... అమ్మాయిలను కదలనివ్వట్లేదు..!

శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. అయితే కొందరమ్మాయిలు ముఖ్యంగా స్కూల్‌ పిల్లలు వ్యాయామం అంటేనే బెరుగ్గా, ఇబ్బందిగా ఫీలవుతున్నారట. కారణమేంటో తెలుసా..!

Updated : 25 Feb 2024 03:36 IST

శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. అయితే కొందరమ్మాయిలు ముఖ్యంగా స్కూల్‌ పిల్లలు వ్యాయామం అంటేనే బెరుగ్గా, ఇబ్బందిగా ఫీలవుతున్నారట. కారణమేంటో తెలుసా..!

స్కూలు ఏదైనా యూనిఫామ్‌ సాధారణమే. అబ్బాయిలకు దానివల్ల సమస్య ఏమీ ఉండదు. కానీ కొన్ని రకాల యూనిఫామ్‌లు మాత్రం అమ్మాయిలను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్‌ చదువుతోన్న పిల్లలు దానివల్ల ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడంలేదని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ తాజా పరిశోధనలో వెల్లడైంది. 135దేశాలకు చెందిన 5-17ఏళ్ల అమ్మాయిలపై పరిశోధనచేస్తే, అందులో చాలామంది డబ్ల్యూహెచ్‌వో సూచనలకు (రోజుకి 60నిమిషాల వ్యాయామం) తగ్గట్లు లేరట. అబ్బాయిలతో పోలిస్తే వీళ్లు 7.6శాతం వెనకబడి ఉన్నారు. అందుకు కారణం పాఠశాలల్లో స్పోర్ట్స్‌ కిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిఫామ్‌, స్కర్ట్స్‌, ఇంకా కొన్ని రకాల డ్రెస్సులను వేసుకోవడానికి ఇబ్బంది పడుతుండటమే. వీటివల్ల బ్రేక్‌టైం గేమ్స్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ వంటివి ఆడటానికి బాలికలు ఆసక్తి చూపించడం లేదు. అసౌకర్యంగా ఉండే దుస్తులు వేసుకోవడానికి ఇన్‌సెక్యూర్‌గా ఫీలై, మైదానంలో ఆడడానికి సంకోచిస్తున్నారట. దీనివల్ల ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారట. అందుకే అమ్మాయిలకు అసౌకర్యంగా ఉండే యూనిఫామ్‌, స్పోర్ట్స్‌ దుస్తుల్లో కొన్ని మార్పులు చేయాలని స్కూల్‌ కమ్యూనిటీలకు సూచిస్తున్నారు పరిశోధకులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్