మొక్కలకు ఆహార కడ్డీలు..

ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకుంటున్న మొక్కల్ని ఏదో కారణంచేత వారం పది రోజులు పరిరక్షించడం మర్చిపోతే చాలు.. తలలు వాల్చేస్తాయి. అలా సమయం లేనప్పుడు మొక్కలను పరిరక్షించడానికి ఇప్పుడు కొత్తపద్ధతులొచ్చాయి. అవేంటో చూద్దాం.

Published : 06 Jul 2022 01:23 IST

ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకుంటున్న మొక్కల్ని ఏదో కారణంచేత వారం పది రోజులు పరిరక్షించడం మర్చిపోతే చాలు.. తలలు వాల్చేస్తాయి. అలా సమయం లేనప్పుడు మొక్కలను పరిరక్షించడానికి ఇప్పుడు కొత్తపద్ధతులొచ్చాయి. అవేంటో చూద్దాం.

పోషకాలతో...

మొక్కలకు కావాల్సిన పోషకాలైన ఫాస్ఫరస్‌, పొటాషియం, నైట్రోజన్‌ వంటివాటిని కలిపి తయారుచేస్తున్న ఫుడ్‌ స్టిక్స్‌ ఇప్పుడు లభ్యమవుతున్నాయి. సహజ సిద్ధమైన పోషకాలు, ఎరువుతో కలిపి రూపొందిస్తున్న ఈ కడ్డీలు మొక్కలను ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయి. తోటలోని కాయగూరలు, బాల్కనీలో కుండీల్లో పెంచే క్రోటన్స్‌కూ వీటిని వినియోగించొచ్చు. అంతేకాదు, వంటింటి బాల్కనీల్లో పెంచే ఆకు కూరలకూ ఇవెంతో ఉపయోగపడతాయి. నాలుగైదు కడ్డీలను మొక్క చుట్టూ మట్టి లోపలివరకు ఉండేలా చేస్తే చాలు. నెలన్నర వరకు నీటిని మాత్రం అందిస్తే మొక్కకు కావాల్సిన మిగతా పోషకాలన్నీ ఈ కడ్డీల ద్వారా అందుతాయి.

వీటికి ప్రత్యేకం..

పూల మొక్కలకు ప్రత్యేకంగా బ్లూమ్‌ స్టిక్స్‌ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ కడ్డీల్లో మొక్కకు కావాల్సిన నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌,  పొటాషియం వంటి పోషకాలన్నీ ఉంటాయి. తొట్టెలో మొక్క పరిమాణాన్ని బట్టి రెండు మూడు కడ్డీలను మట్టిలో ఉంచితే చాలు.. మొక్కకు కావాల్సిన పోషకాలను అందించి ఆరోగ్యంగా పూలు విరిసేలా చేస్తాయివి. ఎక్కువ చెమ్మ లేకుండా ఆయా మొక్కలకు తగినట్లుగా నీటిని అందించి,  సూర్యరశ్మిలో ఉంచితే చాలు. పూలు విరబూస్తాయి. రెండు నెలలకోసారి కొత్త కడ్డీలను మొక్క మొదట్లో మట్టిలోపల ఉంచితే నిత్యం మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్