అలంకరణ.. తేలిగ్గా!

దీపావళికి రంగవల్లులు, దీపాలతో ఇల్లంతా అలంకరిస్తాం. ఇల్లంతా చూడముచ్చటగా ఉంటుందిగానీ.. దాని అలంకరణకే బోలెడు సమయం పడుతుంది. తేలిగ్గా పూర్తయ్యే వాటికోసం వెదుకుతున్నారా?

Published : 23 Oct 2022 00:10 IST

దీపావళికి రంగవల్లులు, దీపాలతో ఇల్లంతా అలంకరిస్తాం. ఇల్లంతా చూడముచ్చటగా ఉంటుందిగానీ.. దాని అలంకరణకే బోలెడు సమయం పడుతుంది. తేలిగ్గా పూర్తయ్యే వాటికోసం వెదుకుతున్నారా? ఇవిగో..

చున్నీలు.. భిన్న రంగులవి సాదావి ఎంచుకోండి. కర్టెన్లకు బదులుగా లేదా గదిలో అక్కడక్కడా వేలాడదీయండి. వాటికి ఎల్‌ఈడీ లైట్లనూ జోడిస్తే గదంతటికీ కొత్తలుక్‌ వచ్చేస్తుంది.

రంగు కాగితాలు.. రెండు లేదా భిన్న రంగులవి ఎంచుకోండి. దీపం ఆకారంలో కత్తిరించి తాళ్లకు అతికించి, గోడకు వేలాడదీయండి. వాటి మధ్యలో చిన్న ఎల్‌ఈడీ లైట్లను వేలాడదీస్తే సరి. చూడచక్కగా ఉంటాయి. పిల్లలను భాగస్వాముల్ని చేస్తే ఉత్సాహంగా చేసిస్తారు.

పూలు.. అలంకరణకి ప్లాస్టిక్‌వి తెచ్చుకుంటే మేలు. వెడల్పాటి గిన్నె, బేసిన్‌ లాంటివి తీసుకోండి. దాన్ని నీటితో నింపి పూరేకలను వేయాలి. నీటిలో తేలే కొవ్వొత్తులను తెచ్చుకొని వాటిలో ఉంచి వెలిగించాలి. చుట్టూ పూలు, దీపాలతో వెలిగిస్తే సరి. పూరేకలు, వెడల్పాటి గిన్నె లేకపోతే ఏదైనా విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. పూల దండల మధ్య రంగుల రాళ్లు పెట్టి చుట్టూ దీపాలుంచినా చూడ్డానికి బాగుంటుంది.

గాజులతో.. ముచ్చటపడో, మ్యాచింగ్‌ అనో వేసినా వేయకపోయినా గాజులు కొంటుండటం మనకు అలవాటే. చాలా పోగుపడ్డాయా? రంగురంగుల గాజులను పేర్చి వాటి మధ్యలో దీపాలను ఉంచి చూడండి. ఆ ప్రదేశం రంగుల కాంతులతో నిండడమే కాదు.. ప్రత్యేకంగానూ కనిపిస్తుంది. మళ్లీ వేసుకోమనిపిస్తే గాజులను జిగురుతో అతికించడమో, సెలోఫెన్‌ టేప్‌ వేయడమో చేయొచ్చు.. పడిపోతాయన్న భయముండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్