అనే వాళ్లని అననీ..!

‘ఇంత బక్కగా ఉందేంటి? ఫ్యాషన్‌... తినదు’ ‘నత్తలాగే పని చేస్తుంది’ ‘ఇంత లావుందేంటి? కాస్త తగ్గొచ్చుగా?’  ‘ఆ బట్టలేంటి? అమ్మాయిలా ఉండటమే రాదు’...

Eenadu icon
By Vasundhara Team Published : 28 Oct 2025 01:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘ఇంత బక్కగా ఉందేంటి? ఫ్యాషన్‌... తినదు’ ‘నత్తలాగే పని చేస్తుంది’ ‘ఇంత లావుందేంటి? కాస్త తగ్గొచ్చుగా’  ‘ఆ బట్టలేంటి? అమ్మాయిలా ఉండటమే రాదు’...

ప్రతి ఒక్కరం ఇలాంటి కామెంట్లు వింటూనే ఉంటాం కదూ! అరె... మన గురించి తెలియకుండా ఎలా మాట అనేస్తారు? అనీ అనిపిస్తుంది. ఇవన్నీ మీరొక్కరే ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్నారా? ప్రతి ఒక్కరికీ ఇది సాధారణమే. ఇప్పటికిప్పుడు మీరు లావు తగ్గినా, పనిలో వేగం పెంచినా మీలో మరో వంక వెతుకుతూనే ఉంటారు. వీటిని పట్టించుకుని, అనవసరంగా మనసుకి తీసుకుని బాధ పడటమే తప్ప లాభం మాత్రం ఏముంటుంది చెప్పండి? పైగా వాటిని మార్చుకోవాలన్న తాపత్రయంలో అనవసర ఒత్తిడి. అందుకే ఎవరు ఏమైనా మాట్లాడనీ, ఎంతైనా జడ్జ్‌ చేయనీ, ఎవరితోనైనా పోల్చనీ... అది వాళ్ల తత్వం అనుకుని వదిలేయండి. వాళ్లకోసం, వాళ్లని సంతృప్తిపరచాలని మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మాత్రం వెళ్లొద్దు. ఇది నా జీవితం. నాకోసం నేను బతుకుతున్నా అనుకున్నంత కాలం ఇవేమీ మనపై ప్రభావం చూపులేవు. కాబట్టి, మీ కలల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. లక్ష్యాలను సాధించుకోండి. అలాచేస్తే ఒకప్పుడు మీకు వంకలు పెట్టినవారే... మిమ్మల్ని స్ఫూర్తిగా చూపిస్తూ పొగుడుతారు. అలాగని అన్నింటా ముందుండాలన్న ఒత్తిడి కూడా అవసరం లేదు. ఎవరి మెప్పో పొందాల్సిన పనీ లేదు. మీ పనిని మీరు మెరుగ్గా చేసుకుంటూ వెళ్లండి చాలు. దాన్నుంచి మీరు సంతృప్తి పొందగలిగినా కావాల్సినంత సంతోషం. అయితే ఇక్కడ ఇతరులకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు. సద్విమర్శలనీ వదిలేయొద్దు. వాటిలో తగినవీ, నేర్చుకోగలవీ మాత్రం చూసుకోండి. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకుంటూ ఆనందంగా సాగిపోవచ్చు. ఏమంటారు? 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్