భయం పోతేనే... ఆ ట్యాగ్‌ పోయేది!

గలగలా మాట్లాడాలని, మనసులో మాట చెప్పాలని, ఆలోచనల్ని పంచుకుని పది మందితో శభాష్‌ అనిపించుకోవాలని భావించని అమ్మాయిలు ఉంటారా. నిజానికి కెరియర్‌లో దూసుకుపోవడానికి ఈ లక్షణాలన్నీ చాలా అవసరం.

Eenadu icon
By Vasundhara Team Published : 31 Oct 2025 01:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

లగలా మాట్లాడాలని, మనసులో మాట చెప్పాలని, ఆలోచనల్ని పంచుకుని పది మందితో శభాష్‌ అనిపించుకోవాలని భావించని అమ్మాయిలు ఉంటారా. నిజానికి కెరియర్‌లో దూసుకుపోవడానికి ఈ లక్షణాలన్నీ చాలా అవసరం. కానీ ఏవో కొన్ని భయాలు, ఇంట్రావర్ట్‌లంటూ చిన్నప్పట్నుంచి ఉండే ట్యాగ్‌లు మనల్ని వెనక్కి లాగుతుంటాయి. మరి ప్రస్తుత పోటీ ప్రపంచంలో వీటి నుంచి బయటపడకపోతే వృత్తిలో రాణించడం చాలా కష్టం కదా. పైగా పరిస్థితులు తెలియకుండా ఆటిట్యూడ్, పొగరు, గర్వం, అహం... వంటి పేర్లు పెట్టేవారూ లేకపోలేదు. అందుకే వీటినుంచి బయటపడాలంటే...

  • ఇంట్రావర్ట్‌లు ఎప్పుడూ మనసులో మాట చెప్పడం బలహీనతగా భావిస్తారు. అందుకే సందర్భం, ప్రాంతం ఏదైనా మాట్లాడటానికి ఆలోచిస్తారు. ఇలా చెప్పడం బలహీనత కాదని అన్ని విషయాల్లోనూ మౌనం పనికిరాదని మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మాట్లాడటానికి ప్రయత్నించండి. 
  • ఆలోచన చిన్నదైనా... మీ గురించి పూర్తిగా తెలిసి, మిమ్మల్ని అర్థం చేసుకునే వారితో పంచుకోవడం మొదలుపెట్టండి. చిన్న ప్రారంభాలే పెద్ద పనులకు పునాదులు. పైగా, దీనివల్ల ఆలోచనలు మీతోనే ఉండిపోకుండా ఎక్స్‌ప్లోర్‌ అవుతాయి. నెమ్మదిగా వాటిని అదిమిపెట్టే అలవాటు మీకూ పోతుంది. 
  • మీరు పంచుకోవాలనుకున్న విషయాల్ని ఓ చోట రాసుకోండి. దానికి సంబంధించిన ప్రతికూల, అనుకూల అంశాల్ని అన్ని కోణాల్లోనూ వెతకడం ప్రారంభించండి. విషయ అవగాహనతోపాటు మీ శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకం కలుగుతుంది. దాంతో నలుగురిలో మాట్లాడే ధైర్యమూ వస్తుంది.
  • గెట్‌టుగెదర్‌లు, లంచ్‌లు, పార్టీలకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడరు. పరిచయాలు పెరిగేది ఇక్కడే. వాటిని దాటవేయకుండా నచ్చిన వాటికి వెళ్లండి. చుట్టూ ఉన్న వాళ్లని పలకరించండి. మొదట్లో కష్టంగా ఉన్నా... రానురానూ ఇవన్నీ అలవాటవుతాయి.

ఇవన్నీ చేస్తూ మీలో భయాన్ని నెమ్మదిగా అధిగమిస్తేనే మీ మీద ఉండే ప్రతికూల ట్యాగ్‌లు పోయేది. అయితే ఏం చేసినా... గోప్యత, భద్రత, వ్యక్తిగత హద్దులు వంటి విషయాల్ని మాత్రం గమనించుకుంటూ ఉండండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్