‘మొంథా...’ ఈ పేరు ఎవరు పెట్టారు?

పబుక్, ఫణి, వాయు, హిక్కా, మహా, బుల్బుల్, ఫెంగల్, మాండస్‌... ఏంటివన్నీ అనుకుంటున్నారా. ఇవన్నీ సైక్లోన్ల పేర్లు... అప్పుడప్పుడూ సముద్రాలు, మహాసముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడటం, అవి తుపాన్లుగా మారడం, బీభత్సం సృష్టించడం, తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడం తెలిసిందే.

Eenadu icon
By Vasundhara Team Updated : 29 Oct 2025 14:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బుక్, ఫణి, వాయు, హిక్కా, మహా, బుల్బుల్, ఫెంగల్, మాండస్‌... ఏంటివన్నీ అనుకుంటున్నారా. ఇవన్నీ సైక్లోన్ల పేర్లు... అప్పుడప్పుడూ సముద్రాలు, మహాసముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడటం, అవి తుపాన్లుగా మారడం, బీభత్సం సృష్టించడం, తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడం తెలిసిందే. అయితే సైక్లోన్‌ వచ్చిన ప్రతిసారీ ఓ కొత్త పేరు ఉంటుంది. అసలీ పేర్లేమిటీ, ఎవరు పెడతారనే సందేహం కలగడం సహజం. ప్రస్తుత తుపాన్‌ పేరు ‘మొంథా’. దీనికీ పేరు పెట్టిందెవరో తెలుసా... థాయ్‌లాండ్‌. మొంథా అంటే థాయ్‌ భాషలో ‘సువాసన గల పువ్వు’ అని అర్థమట. 

బంగాళాఖాతం, అరేబియా సహా ఉత్తర హిందూ మహా సముద్రంలో ఏర్పడే తుపాన్‌లకు న్యూదిల్లీలోని ‘రీజనల్‌ స్పెషలైజ్డ్‌ మెటియోరలాజికల్‌ సెంటర్‌(ఆర్‌.ఎస్‌.ఎం.ఎస్‌)’ పేర్లు పెడుతుంది. దీన్ని ప్రపంచ వాతావరణ సంస్థ, యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఆసియా అండ్‌ పసిఫిక్‌ల పర్యవేక్షణలో భారత వాతావరణ శాఖ నిర్వహిస్తోంది. అదెలా అంటే- ఈ ప్రాంతంలో ఏర్పడే తుపాన్లకు పేర్లను బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, యెమెన్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ... ఈ 13 దేశాలు సూచిస్తాయి. ఒక్కో దేశం 13 పేర్ల జాబితాను సమర్పిస్తుంది. ఇలా వచ్చిన మొత్తం 169 పేర్ల జాబితా నుంచి సైక్లోన్‌ ఏర్పడినప్పుడల్లా వరస క్రమంలో పేరును ఐఎండీ ఎంపికచేస్తుందట. సాధారణంగా వర్ణమాల క్రమంలో పేర్లను ఎంచుకుంటారు. ఈ ఉష్ణమండల తుపానుల నామకరణం అనే ప్రక్రియ సెప్టెంబర్‌ 2004లో అధికారికంగా ప్రారంభమైంది. అది కూడా తుపాన్‌ 62 కి.మీ. లేదా అంతకన్నా ఎక్కువ ఉపరితల గాలి వేగాన్ని చేరుకున్నప్పుడే పేరు పెడతారు. ఈ పేర్లు పెట్టేటప్పుడు కొన్ని నియమాలనూ తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. ఇష్టానుసారంగా పెట్టకూడదు.

  • రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు అతీతంగా ఉండాలి.
  • ఏ వర్గం మనోభావాలూ దెబ్బతినకూడదు. పేరులో క్రూరత్వం ఉండకూడదు.
  • ఉచ్చారణ సులభంగా ఉండాలి. ఇంగ్లిష్‌లో ఎనిమిది అక్షరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
  • సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.
  • ఒకసారి వాడిన పేరును పునరావృతం చేయకూడదు. 

అధికారులూ ప్రజలూ త్వరగా అప్రమత్తమై హెచ్చరికల్ని అర్థం చేసుకునేందుకూ సులభంగా గుర్తించేందుకూ శాస్త్రవేత్తలు త్వరగా సమాచార మార్పిడి చేసుకునేందుకూ సౌకర్యంగా ఉంటుందనే ఈ తుపాన్ల నామకరణం!

Trending

Tags :
Published : 29 Oct 2025 07:09 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్