ఏడాదిలో.. 177 దేశాలు!

ఆమె వికలాంగురాలు. అలాగని ప్రపంచం చుట్టిరావాలనే తన కలను ఆపలేదు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి వైకల్యం అడ్డుకాదనుకుంది.

Published : 26 Feb 2023 00:16 IST

ఆమె వికలాంగురాలు. అలాగని ప్రపంచం చుట్టిరావాలనే తన కలను ఆపలేదు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి వైకల్యం అడ్డుకాదనుకుంది. ఏడాది క్రితం చక్రాల కుర్చీలోనే 117 దేశాలు పర్యటించింది. ప్రపంచరికార్డునూ సాధించిన రెనీ బ్రన్స్‌ స్ఫూర్తి కథనమిది.

రెనీబ్రన్స్‌కు అయిదేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబమంతా విమానంలో న్యూయార్క్‌సిటీకి వెళ్లింది. అప్పుడే పెద్దైన తర్వాత ప్రపంచాన్నంతా చుట్టేయాలని అనుకుందట. అట్లాంటాకు చెందిన ఈమెకు పుట్టుకతోనే శారీరక సమస్యలున్నాయి. అమ్మానాన్నలకు ఒక్కగానొక్క కూతురీమె. సాయం లేనిదే అడుగులేయలేని పరిస్థితి చూసి, తల్లిదండ్రులు ఆమెను తిప్పని ఆసుపత్రిలేదు. అయినా ఫలితం లేదు. ఎముకల జాయింట్స్‌ పనితీరు బలహీనమైంది. మోకాళ్లు, హిప్స్‌ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మొదట చేయూతనందిస్తే అడుగులేయగలిగే బ్రన్స్‌ ఏడేళ్లు నిండేసరికే చక్రాలకుర్చీకి పరిమితమైపోయింది.

అన్నింట్లోనూ..

చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండాలంటే చదువు ముఖ్యం అని నమ్మింది బ్రన్స్‌. ‘అమ్మ నన్ను ఉన్నత చదువులు చదవమని ప్రోత్సహించేది. అలాగే నాన్న, బంధువులందరి చేయూత ఉండేది. దాంతో నేను చదువుతోపాటు పియానో వాయించడంలోనూ ముందుండేదాన్ని. చర్చి, చుట్టుపక్కల జరిగే కార్యక్రమాల్లో వాయించి అందరి ప్రశంసలు అందుకునేదాన్ని. అలాగే డిగ్రీ పూర్తి చేయగలిగాను కూడా. ఆ తర్వాత ఒక ఇన్సూరెన్స్‌ సంస్థలో పనిచేస్తూ కాలిఫోర్నియా నుంచి నార్త్‌ కరోలినా, అట్లాంటా, జార్జియా తదితర దేశాలన్నీ పర్యటించా. చిన్నప్పటి నుంచి ప్రపంచం చుట్టాలనే కల. దాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నా. పర్యటక ప్రాంతాలు చుట్టిరావడం నాకిష్టం. దాంతో ఏటా రెండుమూడు దేశాలు చూసొస్తుంటా. అయితే ఏడాదిలోపు ప్రపంచంలో వీలైనన్ని దేశాలకు వెళ్లాలనిపించింది. దాంతో గతేడాది వేసవిలో ప్రపంచయాత్ర మొదలుపెట్టా. పలుచోట్ల ఇబ్బందులెదురైనా స్థానికులు, తోటి ప్రయాణికులు అందించిన చేయూత నన్ను ముందుకు నడిపించాయి. అలా 2022లో మొదలు పెట్టి, ఏడాది వ్యవధిలో మొత్తం 117 దేశాలు చుట్టేశా. ఇలా వీల్‌చెయిర్‌లో ఇన్ని దేశాలు తిరిగిన వ్యక్తిగా రికార్డుకెక్కా. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డులోనూ చోటు సంపాదించా. ఇది నా కల మాత్రమే కాదు, నాలాంటి వాళ్లందరూ నన్ను చూసి స్ఫూర్తి పొందుతారనే ఆశ కూడా’ అని చెప్పుకొస్తున్న బ్రన్స్‌ కథ అందరికి స్ఫూర్తిదాయకం కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్