నడిపించే... నీల!

స్వేచ్ఛను ప్రేమించగలిగిన వాళ్లు... నీలతో కలిసి అడుగులు వేసే ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే ఈ పుస్తకంలో పేజీలు తిప్పగలరు అని విమర్శకుల ప్రశంసలు అందుకున్న నీల. 550 పేజీల సుదీర్ఘమైన నవల. ఆపకుండా చదివిస్తుంది.

Published : 03 Mar 2024 01:27 IST

స్వేచ్ఛను ప్రేమించగలిగిన వాళ్లు... నీలతో కలిసి అడుగులు వేసే ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే ఈ పుస్తకంలో పేజీలు తిప్పగలరు అని విమర్శకుల ప్రశంసలు అందుకున్న నీల. 550 పేజీల సుదీర్ఘమైన నవల. ఆపకుండా చదివిస్తుంది. మారుమూల గ్రామంలో, వెనకబడిన కుటుంబం నుంచి అనాథగా మొదలైన నీలవేణి ప్రయాణం... దిల్లీ వరకూ సాగి ఎంత బలమైన వ్యక్తిగా మారిందన్నదే కథాంశం. తన భర్త జీవితంలో మరొక స్త్రీ ఉందని తెలిసి వివాహ బంధం నుంచి బయటపడుతుంది నీల. విడాకుల తరవాత వచ్చే స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటూ, తన కూతురితో కలిసి నిలదొక్కుకొనే ప్రయత్నంలో.. ఎంతోమంది స్త్రీలతో కలిసి ప్రయాణిస్తుంది. వసుంధర, ఆరంజ్యోతి, పైడమ్మ, సంపూర్ణ ఇలా ఎన్నో మహిళా పాత్రలు వేటికవే ప్రత్యేకంగా ఉంటూ మనలో సమస్యలను ఎదిరించి పోరాడే శక్తిని ఇస్తాయి. ఈ పాత్రలన్నీ కలిసి సిస్టర్‌హుడ్‌ అనే పదానికి నిర్వచనంలా నిలబడతాయి. ఓ మంచి పుస్తకం మన ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని నిరూపించారు రచయిత్రి కె.ఎన్‌. మల్లీశ్వరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్