రూ. 80 అప్పు... 1600 కోట్ల వ్యాపారం!

ఏడుగురు మహిళలు... రూ.80 అప్పుతో ప్రారంభించిన వ్యాపకం ఏం సాధించగలదో ఊహించగలరా? రూ.1600 కోట్ల వ్యాపారంతోపాటు... 45 వేలమంది ఆడవాళ్లకు ఉపాధి. ఎన్నో తరాల్లో స్ఫూర్తినింపిన ఈ ‘లిజ్జత్‌ పాపడ్‌’ విజయం ... రాబోయే తరాలకూ అదే ధైర్యాన్ని నింపుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.

Updated : 03 Mar 2024 08:10 IST

మహిళాలోకం

ఏడుగురు మహిళలు... రూ.80 అప్పుతో ప్రారంభించిన వ్యాపకం ఏం సాధించగలదో ఊహించగలరా? రూ.1600 కోట్ల వ్యాపారంతోపాటు... 45 వేలమంది ఆడవాళ్లకు ఉపాధి. ఎన్నో తరాల్లో స్ఫూర్తినింపిన ఈ ‘లిజ్జత్‌ పాపడ్‌’ విజయం ... రాబోయే తరాలకూ అదే ధైర్యాన్ని నింపుతుందని కచ్చితంగా చెప్పొచ్చు...

ఇప్పటిమాట కాదు. 62 ఏళ్ల క్రితం... వ్యాపారం చేస్తామంటే ఆడవాళ్లని నమ్మి అప్పు ఇచ్చేదెవరు? ముంబయిలో ఉంటున్న గుజరాతీ మహిళలు జస్వంతీబెన్‌ పోపట్‌, ఆమె స్నేహితురాళ్లకూ ఇదే కష్టం వచ్చింది. కుటుంబానికి అండగా ఉండటం కోసం, అప్పడాల వ్యాపారం చేయాలన్న వీళ్ల తపన అర్థం చేసుకుని ఓ సామాజిక కార్యకర్త మంచి మనసుతో రూ.80 అప్పుగా ఇచ్చారు. ‘మీ వ్యాపారంలో నాణ్యత అనే మాటకి ఎప్పటికీ విలువనివ్వండి’ అని ఆయన అన్న మాటలు వాళ్ల మనసులో నాటుకుపోయాయి.

మొదటి సారి నాలుగు ప్యాకెట్లు తయారు చేసి దగ్గర్లోని మార్కెట్లో అమ్మగానే ఆ ఏడుగురికీ వాళ్లు చేస్తున్న పనిపై నమ్మకం వచ్చింది. వ్యాపారం పెరిగాక, చుట్టుపక్కల మహిళలకూ ఉపాధినిచ్చారు. క్రమంగా ఇదో మహిళా సహకార సంఘంగా మారింది. అంటే సంస్థ లాభాల్లో అక్కడ పనిచేసే మహిళలందరికీ వాటా ఉంటుందన్నమాట. ఈ ప్రయోగం ఫలించి లిజ్జత్‌ పేరు దేశమంతా మారుమోగింది. దీనికి తోడు కుర్రమ్‌... కుర్రమ్‌ అనే జింగిల్‌ దూరదర్శన్‌లో వినిపించడం మొదలుపెట్టాక ఈ ఉత్పత్తి ఇంటింటి బ్రాండ్‌గా మారిపోయింది. 80 బ్రాంచీలతో.. 15 దేశాల్లో విస్తరించిన ఈ అప్పడాల వ్యాపారం 45 వేలమంది మహిళలకు ఉపాధి చూపించింది. రూ.1600 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఇంతకీ ‘లిజ్జత్‌’ అంటే... గుజరాతీలో రుచి అని అర్థం. బ్రాండ్‌ పేరుకోసం పోటీ పెట్టినప్పుడు ఈ పేరుని సూచించి రూ.5 బహుమతి పొందిందో అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్