నీటి పాఠాలు చెప్పేస్తారామె!

రెండు రోజులకోసారి స్నానం, ప్లాస్టిక్‌ ప్లేటుల్లో భోజనం, వర్క్‌ ఫ్రం హోం కోసం ఉద్యోగుల విన్నపాలు.. ఇవీ నేడు బెంగళూరులో నీటి ఎద్దడి తట్టుకోలేక ప్రజలు పడుతున్న కష్టాలు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి కొంతమంది వాటర్‌ వారియర్స్‌గా మారి నీటిని పొదుపు చేస్తున్నారు.

Updated : 24 Apr 2024 15:42 IST

రెండు రోజులకోసారి స్నానం, ప్లాస్టిక్‌ ప్లేటుల్లో భోజనం, వర్క్‌ ఫ్రం హోం కోసం ఉద్యోగుల విన్నపాలు.. ఇవీ నేడు బెంగళూరులో నీటి ఎద్దడి తట్టుకోలేక ప్రజలు పడుతున్న కష్టాలు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి కొంతమంది వాటర్‌ వారియర్స్‌గా మారి నీటిని పొదుపు చేస్తున్నారు. వారిలో ఒకరే ఒడెట్‌ కాట్రాక్‌. తనదైన పంథాలో ‘సేవ్‌ వాటర్‌’ ప్రచారంతో పదిహేను సంవత్సరాల నుంచీ, చుట్టుపక్కల వారితో నీటిని పొదుపు చేయిస్తున్నారు.

పూర్వం మహారాణులు రాజ్యాన్నీ, ప్రజలనూ కాపాడుకొనేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడం, బిడ్డలను నడుంకి కట్టుకొని కదన రంగంలో కత్తి తిప్పడం వంటివి విన్నాం. సామాన్య ప్రజలు సైతం తమ వంతుగా యుద్ధంలో కదం తొక్కేవారు. రణరంగానికి వెళ్లేటప్పుడు కత్తి, బల్లెం చేతపట్టి వెళ్లడం మనకు తెలుసు. సరిగ్గా ఇలాంటి వాతావరణాన్నే ఒడెట్‌ తొమ్మిదేళ్ల క్రితం బెంగళూరులో తన ఇంటి పరిసరాల్లో చూశారు. అయితే ఈ యుద్ధం మంచినీటి కోసం. మహిళలు తమ పిల్లలతో కలిసి బిందెలు, బకెట్‌లూ పట్టుకుని చేసే పోరాటం నిజంగా ఓ యుద్ధ వాతావరణాన్నే తలపించేదట. ‘అప్పుడే బావి తరాల భవిష్యత్తు నా కళ్లకు కట్టినట్లు కనిపించింది. నీటిని పొదుపు చేయకపోతే గ్లాసు మంచినీటి కోసం ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలో కళ్లకు కట్టినట్లుగా కనపడింది’ అంటారు 60ఏళ్ల ఒడెట్‌. తరవాతి తరాలకు నీటి సమస్య రాకూడదంటే.. మన ఇంటిలో వాడే నీటికి పరిమితి పెట్టుకోవాలి. అప్పుడే నీటిని ఆదా చేయగలమని నమ్మారీమె.

దాదాపు పదిహేను సంవత్సరాలుగా తక్కువ నీటిని ఎక్కువ సార్లు తను వాడటమే కాకుండా చుట్టూ ఉన్నవారూ అనుసరించేలా చూస్తున్నారు.  మూడు మగ్గుల నీటితో స్నానం ముగించాలి. పండ్లూ, కూరగాయలూ, చేతులు కడిగిన నీటిని తిరిగి మొక్కలకు వినియోగిస్తే నీరు ఆదా అవుతుంది. వేస్ట్‌ ఆర్‌ఓ వాటర్‌ని గిన్నెలు కడగటానికీ, ఇంటి లోపల నేలను శుభ్రం చేయడానికీ వినియోగిస్తాను. నా లెక్క ప్రకారం- ప్రతి ఇంటిలో ప్రస్తుతం వాడేదాంట్లో 30-40 శాతం మాత్రమే నీటి అవసరం ఉంటుంది. బెంగళూరు మాదిరిగానే ప్రతిచోటా భూగర్భంలో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. రాబోయే తరాలు నీటి కష్టాలు పడకుండా ఉండాలంటే ప్రతి నీటిబొట్టు లెక్కగా వాడుకోవాలంటారు’ ఒడెట్‌.

కంపుకొడతావ్‌ అనేవారు..

‘మొదట్లో మూడు మగ్గులతో స్నానం చేస్తుంటే.. నీ దగ్గరకు వస్తే ముక్కు మూసుకోవాలేమో’ అంటూ నా స్నేహితుడు వ్యంగ్యంగా ఆట పట్టించాడు. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు. నీటి వృథా పట్ల ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకురావడానికీ అందమైన భారత దేశాన్ని చూసేందుకూ ‘సేవ్‌ వాటర్‌’ ప్రచారాన్ని చేపట్టా’ అంటారు ఒడెట్‌.

వేసవిలో నీటి కొరత నేపథ్యంలో- నీటిని పొదుపు చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్