ఎంత సరిచేసినా మారడేంటి?

మేం ఐటీ ఉద్యోగులం. ఒక్కడే బాబు, నాలుగేళ్లు. అన్నీ నేర్చుకోమని ప్రోత్సహిస్తుంటాం. బొమ్మలు కొనిస్తాం. అన్నిచోట్లకూ తీసుకెళ్తాం. కానీ తరచూ డిస్టర్బ్‌ చేస్తే విసుక్కుంటున్నాం. మాటలు తడబడతాయి.

Published : 17 Jun 2021 01:47 IST

మేం ఐటీ ఉద్యోగులం. ఒక్కడే బాబు, నాలుగేళ్లు. అన్నీ నేర్చుకోమని ప్రోత్సహిస్తుంటాం. బొమ్మలు కొనిస్తాం. అన్నిచోట్లకూ తీసుకెళ్తాం. కానీ తరచూ డిస్టర్బ్‌ చేస్తే విసుక్కుంటున్నాం. మాటలు తడబడతాయి. ఎంత సరిచేసినా అంతే. విసుక్కుంటే ఏడుస్తాడు. ఎదురు తిరుగుతాడు. బంధువులొస్తే జంకు. తోటి పిల్లలు, మా అమ్మానాన్నలతో బాగానే ఉంటాడు. మా దగ్గరే ఇలా. బాధగా ఉంది. 

- ఒక సోదరి, బంజారాహిల్స్‌

కరిద్దరు పిల్లలే ఉండటాన పెంపకలోపంతో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, నత్తి లాంటివి వస్తున్నాయి. రెండుమూడేళ్ల వయసులో అభద్రత లేకుండా సంతోషంగా ఉండేలా పెంచాలి. క్రమ శిక్షణలో పెట్టొచ్చు. కానీ చిన్నచిన్న విషయాల్లో సరిదిద్దడం, కోప్పడటం సరికాదు. పిల్లవాడు తాత అమ్మమ్మల దగ్గర ఆనందంగా ఉంటాడంటే కచ్చితంగా వాడికి కంపెనీ కావాలి. ప్రతి మంచి పనికీ ప్రశంసించాలి. భయపెట్టకుండా చెప్పాలి. మీరిద్దరూ బిజీగా ఉండటం వల్ల మీకు ఇష్టమైనవి, వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తున్నాడు. పిల్లవాడికి అన్నీ ఇస్తున్నామంటున్నారు. కానీ ముఖ్యంగా కావలసింది మీ ప్రేమ, మీ సమయం, ప్రోత్సాహం. మాటలొచ్చే వయసులో తప్పులు, తడబాటు సహజం. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే అదే సరైపోతుంది. మాటిమాటికీ కరక్ట్‌చేసి, కోప్పడటంతో భయం పట్టుకుంటుంది. మిమ్మల్ని ప్లీజ్‌ చేయాలని మళ్లీ చెప్తాడు. తప్పు రాకూడదనే కంగారులో నత్తి పెరుగుతుంది. కరక్ట్‌ చేస్తున్నారనే భయంతో బిగుసుకుపోతాడు. దూరంగా వెళ్తాడు. చుట్టు పక్కల పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారు, మీ బాబుని వెక్కిరిస్తారని కరక్ట్‌ చేయడంతో అభద్రతాభావం, భయం, కోపం, అసహనం పెరిగి ఏడుస్తాడు, గొడవ చేస్తాడు. కనుక ఇలాంటి పిల్లల్ని జాగ్రత్తగా, సున్నితంగా పెంచాలి. తప్పులు చేసినా సరిచేయకుండా స్పీచ్‌ థెరపీ ఇప్పించండి. కథలు చెప్పించి రికార్డ్‌ చేయండి. చక్కగా చెప్తే మెచ్చుకోండి. వీళ్లకి పాటలు, కథల్లో తప్పులు దొర్లవు. కనుక సులువుగా చేయగలిగేవాటితో ప్రాక్టీస్‌ చేయించి మెచ్చుకోండి. నత్తి గురించి అస్సలు మాట్లాడకుండా స్వేచ్ఛ ఇస్తే సంతోషంగా ఉంటాడు. అప్పుడప్పుడూ అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గరికి పంపితే అభద్రత ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్