తలలో చేయిపెడితే సమస్యే!

ఎవరి తలలోనైనా చేయి పెడితే కళ్లు ఎర్రగా మారడంతో పాటు దురద, కన్నీళ్లొచ్చేస్తాయి. దగ్గరగా చూసినా, తగిలినా ఇలాగే అవుతోంది. ఎర్రదనం రెండు రోజుల వరకూ ఉంటోంది. పాపకి జడ వేయాలన్నా ఇబ్బందిగా ఉంది. ఇదేం సమస్య? తగ్గుతుందా?

Published : 03 Jul 2021 01:20 IST

ఎవరి తలలోనైనా చేయి పెడితే కళ్లు ఎర్రగా మారడంతో పాటు దురద, కన్నీళ్లొచ్చేస్తాయి. దగ్గరగా చూసినా, తగిలినా ఇలాగే అవుతోంది. ఎర్రదనం రెండు రోజుల వరకూ ఉంటోంది. పాపకి జడ వేయాలన్నా ఇబ్బందిగా ఉంది. ఇదేం సమస్య? తగ్గుతుందా?

- పి.మనోజ్ఞ, బెంగళూరు

ఇది సాధారణమే. మనకు పడనిది ఏది దగ్గరకు వచ్చినా, తాకినా శరీరం యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. మీకు ఇతరుల జుట్టుతో ఆ సమస్య ఉంది. కాబట్టి దద్దుర్లు, కంటి నుంచి నీరు వస్తున్నాయి. కొందరిలో ఇది మరింత ఎక్కువగా.. తలనొప్పి, సైనస్‌, గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బంది అవడం వంటివీ కనిపిస్తాయి. శరీరతత్వాన్ని బట్టి కొన్ని గంటల నుంచి రోజులపాటు ఈ లక్షణాలుంటాయి. పాపకి వాడే షాంపూ, కండిషనర్‌, హెయిర్‌ డై, స్ప్రే వంటి వాటిల్లో రసాయనాలు పడక కూడా అలర్జీ వస్తుండొచ్చు. కాబట్టి సహజమైన కుంకుడు కాయ వంటివి వాడి చూడండి. కుదిరితే దూరంగా ఉండండి. లేదంటే యాంటీ హిస్టమిన్స్‌ను వాడొచ్చు. వీటిని రోజూ ఒకటి చొప్పున 20 - 30 రోజులు వాడితే అలర్జీ రాదు. వీటితోపాటు సహజ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తే.. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్