కాళ్లు తెల్లగా అవ్వాలంటే..!

నాకు నలభై ఏళ్లు. ఈమధ్య కాళ్లు నల్లబడ్డాయి. మనుపటిలా తెల్లగా మారే మార్గం చెప్పండి.

Updated : 17 Jul 2021 01:19 IST


నాకు నలభై ఏళ్లు. ఈమధ్య కాళ్లు నల్లబడ్డాయి. మనుపటిలా తెల్లగా మారే మార్గం చెప్పండి. - ఓ సోదరి

వయసు పైబడే కొద్దీ రంగు మారడం సాధారణమే. సూర్యరశ్మి శరీరానికి తగిలే సమయాన్ని బట్టీ మార్పులొస్తుంటాయి. చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం పొడిబారుతుంటుంది. సబ్బు ఎక్కువ వాడినా ఈ సమస్య కనిపిస్తుంది. అదీకాక ఇతర శరీర భాగాల సంరక్షణపై పెట్టిన శ్రద్ధ పాదాలపై చూపించం. సరైన పోషణ లేక కూడా నల్లబడుతుంటాయి. రక్త ప్రసరణ సరిగా జరగకపోయినా, దెబ్బ తగిలినా, మధుమేహం ఉన్నా, ఎక్కువ చల్లదనంలో పాదాలున్నా కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి, థైరాయిడ్‌, డయాబెటిస్‌లతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో చెక్‌ చేయించుకోండి. అవసరమైతే మందులు వాడాలి.

ముందు సబ్బును తక్కువగా ఉపయోగించాలి. కాళ్లు కడిగాక తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాయాలి. బయటికి వెళ్లేటపుడు తప్పకుండా సన్‌స్క్రీన్‌ రాయాలి. లాక్టిక్‌ యాసిడ్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి, హైడ్రోక్వినోన్‌లలో ఏదో ఒకటి ఉన్న లైటెనింగ్‌ క్రీమ్‌లను వాడొచ్చు. సహజంగా ప్రయత్నించాలనుకుంటే తేనె, నిమ్మ రసాన్ని, ఫ్రెష్‌ క్రీమ్‌ ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకుని దాన్ని పాదాలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఫ్రెష్‌ క్రీమ్‌, సెనగపిండి, బొప్పాయి గుజ్జు, తేనె టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకుని బాగా కలిపి రాసుకున్నా ఫలితం ఉంటుంది. రోజూ కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ రాసుకోవడం మాత్రం తప్పనిసరిగా చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్