ఆయన్ను వదిలి ఉండలేను!

మా పెళ్లై రెండేళ్లు అయింది. పెళ్లైన తర్వాత ఆయన సంసారానికి పనికి రారనే నిజం తెలిసింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నారు.

Published : 20 Jul 2021 00:51 IST

మా పెళ్లై రెండేళ్లు అయింది. పెళ్లైన తర్వాత ఆయన సంసారానికి పనికి రారనే నిజం తెలిసింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నారు. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేను పెద్దగా చదువు కోలేదు. పుట్టింటి పరిస్థితీ అంతంత మాత్రమే. ఆయన దగ్గరే ఉండి ఒక పాపనో బాబునో తెచ్చి పెంచుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. జీవితాంతం ఎందుకు ఇబ్బంది అంటున్నారు స్నేహితులు. నిజానికి ఆయన చేసింది తప్పే అయినా చాలా మంచివారు. ఆయన్ని వదిలి ఉండలేను. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. 

- ఒక సోదరి, బెంగళూరు

వైవాహిక విషయాలు వ్యక్తిగతమైనవి. అవి ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. పెళ్లయిన తర్వాత జీవితాన్ని భాగస్వామితో శారీరకంగా, మానసికంగా పంచుకోవడం అన్నది సహజం. మీకు మీ భర్త నచ్చి శారీరక సంబంధం లేకపోయినా ఇబ్బంది లేదు, అతన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటే కలిసి ఉండండి. మీరన్నట్లు పిల్లల్ని ఎడాప్ట్‌ చేసుకోవచ్చు. ఇతరులు ఏమంటున్నారో పట్టించుకోవద్దు. ఇది మీ సొంత విషయం. అయితే జీవితాంతం ఉండేది కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు కాకున్నా కొన్నాళ్ల తర్వాత ఆ సుఖం పొందలేదే అనిపిస్తుందేమో! అదేమీ ముఖ్యం కాదని అనిపిస్తే అతనితోనే ఉండొచ్చు. లేదూ, ఇంకా చిన్న వయసులోనే ఉన్నాను, తర్వాత సమస్యలు వస్తాయి అనుకుంటే బయటపడొచ్చు. ముందు అతనికి సమస్య శారీరకమా, మానసికమా అన్నది తెలియాలంటే డాక్టర్‌ని సంప్రదించండి. వీలైతే చికిత్స చేస్తారు. లోపం ఉందని చెప్తే ఏం చేయాలో మీరే తేల్చుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్