ఎదుటి వాళ్లే బాగున్నారని...

అందం, చదువు, తెలివి తేటలు, ఆర్థిక పరిస్థితులు... ప్రతిదీ ఇతరులతో పోల్చుకుని బాధపడుతుంటాను. ఎదుటివాళ్లే అన్ని విధాలుగా బాగున్నారు అనిపిస్తుంది.

Updated : 06 Aug 2021 17:11 IST

అందం, చదువు, తెలివి తేటలు, ఆర్థిక పరిస్థితులు... ప్రతిదీ ఇతరులతో పోల్చుకుని బాధపడుతుంటాను. ఎదుటివాళ్లే అన్ని విధాలుగా బాగున్నారు అనిపిస్తుంది. ఇలా ఆలోచించడం తప్పని తెలిసినా మార్చుకోలేక పోతున్నాను. ఇలా కాకుండా నన్ను నేను ప్రేమించుకుంటూ ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?

- ఓ సోదరి, భువనేశ్వర్‌

కొందరు తమ సామర్థ్యాన్ని తాము గుర్తించలేకపోవడం, లేదా తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల ఆత్మన్యూనతకు లోనవుతారు. మీరా కోవకి చెందిన వారు. మొదటి నుంచి అలా ఉంటే అదొక అలవాటుగా, వ్యక్తిత్వంలో భాగంగా అయిపోతుంది. చిన్నతనంలో బంధుమిత్రులెవరైనా ఇతరులతో పోల్చి వాళ్లు నీకంటే మిన్న అని చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది. లేదా వాళ్లంతట వాళ్లే ఇతరుల కంటే తాము తక్కువని అంచనా వేసుకోవడం వల్ల న్యూనతాభావం ఏర్పడుతుంది. ఇది పోవాలంటే... ఏ విషయంలో అయినా సరే మీకు మీరే అనుకోవాలి తప్ప వేరేవారితో పోల్చుకోవడం మానేయండి. మీలో నెగెటివ్‌ ఆలోచనలు, మీ పట్ల మీకు తక్కువ అంచనాలు ఉన్నాయి కనుక సైకియాట్రిస్టును కలవండి. వాటిని తగ్గించుకునే పద్ధతులు నేర్పిస్తారు. మీ ఆలోచనా దృక్పథాన్ని మారుస్తారు. మీలో ఏయే మంచి గుణాలు ఉన్నాయో గుర్తించండి.  పాటలు పాడటం, బొమ్మలేయడం లాంటి హాబీలుంటే వాటిమీద కృషి చేయండి. మీరు ఇష్టంగా, సమర్థంగా చేయగల పనులను తరచూ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా రాణించేందుకు ప్రయత్నించాలే గానీ ఇతరులతో పోల్చుకోవద్దు. ఎవరైనా పోల్చినా సహించొద్దు. మనకంటే ఎక్కువ తక్కువ ఎవరితోనూ పోల్చుకోకుండా వాస్తవాన్ని గుర్తించండి. మీ గుణాలతో మీరు సంతృప్తి చెందండి. నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయండి.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్