దురద, మంట.. భరించలేకపోతున్నా!

నా వయసు 25. ఈ మధ్య వెజైనా ప్రాంతంలో బాగా దురదగా, మంటగా అనిపిస్తోంది. దుర్వాసన కూడా వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీన్ని నివారించడానికి ఏం చేయాలి?

Updated : 08 Aug 2021 05:34 IST

నా వయసు 25. ఈ మధ్య వెజైనా ప్రాంతంలో బాగా దురదగా, మంటగా అనిపిస్తోంది. దుర్వాసన కూడా వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీన్ని నివారించడానికి ఏం చేయాలి? - ఓ సోదరి, ఖమ్మం
దురదా, మంటా... వాటితోపాటు దుర్వాసన కూడా అంటే కచ్చితంగా ఇన్‌ఫెక్షన్‌ ఉందని అర్థం. ఈ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్‌కు కారణం బ్యాక్టీరియా, ఫంగస్‌,  ట్రైకోమోనాస్‌ ప్రొటోజోవన్‌... ఏదైనా కావొచ్చు లేదా రెండు మూడు రకాల ఇన్‌ఫెక్షన్లు కలిసి కూడా ఉండొచ్చు. కారణమేంటో తెలుసుకోవాలంటే ఆ ప్రాంతాన్ని పరీక్షించాల్సిందే. చర్మం వెలుపలివైపు పొక్కులు, దద్దుర్లు, రింగ్‌వార్మ్‌... ఏమైనా ఉన్నాయేమో పరీక్షిస్తారు. యోనిలోపల స్రావం ఎలా ఉందో కనుక్కుంటారు. ఇది పలుచగా నీళ్లలా లేదా చిక్కగా మీగడ తరకల్లా ఉందా... ఆకుపచ్చగా/బూడిద రంగులో ఉందా అన్న వివరాలను బట్టి చాలా వరకు ఇన్‌ఫెక్షన్‌ దేని వల్ల వచ్చిందో తెలుస్తుంది. కచ్చితంగా తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు తప్పనిసరి. పీహెచ్‌ టెస్ట్‌, పాప్‌స్మియర్‌ పరీక్షలతోపాటు... రక్తహీనత, మధుమేహం వంటివి ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి రక్తపరీక్షలు చేయాలి. కారణమేంటో తెలిసిన తర్వాత దానిబట్టే చికిత్స ఉంటుంది.  ఈ చికిత్సను నోటి మాత్రలు, వెజైనల్‌ ట్యాబ్లెట్స్‌ రూపంలో కూడా ఇస్తారు. క్రీమ్‌లూ అవసరమవుతాయి. మరో ముఖ్యమైన విషయం.. మీ వారికి కూడా ఇలాంటి లక్షణాలుంటే తప్పనిసరిగా అతను కూడా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీకు నయమైన తర్వాత కూడా తిరిగి కలయిక జరిగిన ప్రతిసారి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీరోసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్