ఆడపడుచు మా ఆస్తిలో వాటా అడుగుతోంది!

మా వారికి ఇద్దరక్కలు. వాళ్ల పెళ్లిళ్లప్పుడే తలా ఒక ఎకరం చొప్పున రాసిచ్చారు. మిగిలిన మూడెకరాలు మామగారి తదనంతరం ఎలానూ మాకే కదా అనే ధీమాతో మా వాటా రాయమని అడగలేదు. ఇప్పుడు ఆ ఆస్తిలో మాకూ హక్కు ఉందంటోంది మా ఆడపడుచు. వారిది వారికిచ్చేశాక మళ్లీ ఇందులో వాటాకి వస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా మామగారిని రాయమని అడిగితే...మేం పిల్లల మీద ఆధారపడం.

Published : 30 Aug 2021 00:31 IST

మా వారికి ఇద్దరక్కలు. వాళ్ల పెళ్లిళ్లప్పుడే తలా ఒక ఎకరం చొప్పున రాసిచ్చారు. మిగిలిన మూడెకరాలు మామగారి తదనంతరం ఎలానూ మాకే కదా అనే ధీమాతో మా వాటా రాయమని అడగలేదు. ఇప్పుడు ఆ ఆస్తిలో మాకూ హక్కు ఉందంటోంది మా ఆడపడుచు. వారిది వారికిచ్చేశాక మళ్లీ ఇందులో వాటాకి వస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా మామగారిని రాయమని అడిగితే...మేం పిల్లల మీద ఆధారపడం. మా తర్వాత ఎలానూ మీకే కదా అంటున్నారు. కానీ ఆయన బతికి ఉండగా పంచని ఆస్తికి కొడుకు, కూతుళ్లు సమాన హక్కుదారులంటున్నారు నిజమేనా? ఏదైనా పరిష్కారం చూపించగలరు.

- ఓ సోదరి

ఆస్తి మీ మామగారి స్వార్జితం అయితే ఆయన తన ఇష్టం వచ్చిన వాళ్లకు ఇవ్వొచ్చు. పెళ్లప్పుడు ఆడపిల్లలకు ఇచ్చేశాం కాబట్టి మిగిలిన ఆస్తి అంతా నా తదనôతరం నా కొడుక్కే చెందుతుంది అని ఆయన ఓ వీలునామా రాస్తే ఆస్తి మీకు వచ్చే అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు రాయను అనడం సరికాదు. ఎందుకంటే వీలునామా ఎప్పుడైనా మరణానంతరమే అమలులోకి వస్తుంది. ఒకవేళ అలాంటిదేమీ రాయకుండా చనిపోతే... కూతుళ్లకు రాసి ఇవ్వగా మిగిలిన ఆస్తికి మళ్లీ పిల్లలంతా వారసులే అవుతారు. ఎందుకంటే అది అప్పుడు అందరికీ పిత్రార్జితపు ఆస్తి అవుతుంది. హిందూ వివాహచట్టం ప్రకారం వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తి భార్యకు ఒక భాగం, పిల్లలకు ఒక్కో భాగం చొప్పున చెందుతాయి. లేదా తల్లికి ఒక భాగం, చనిపోయిన కొడుకు పిల్లలు లేదా మరణించిన కూతురు పిల్లలు హక్కుదారులవుతారు. వీళ్లందరూ క్లాస్‌ వన్‌ వారసుల కిందకి వస్తారు. ఒకవేళ మీ ఆడపడుచులు మంచి మనసుతో మాకు ముందే ఆస్తి రాసిచ్చారు కాబట్టి మా హక్కుల్ని వదులుకుంటున్నామని (రెలిన్‌క్విష్‌ దైర్‌ రైట్స్‌) ఒక డీడ్‌ రాసి ఇస్తే కూడా ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడి నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్